ప్రధాన మంత్రి కార్యాలయం
పారిస్ ఒలింపిక్స్ లో రజతాన్ని గెలిచిన శ్రీ నీరజ్ చోప్రా కు ప్రధాన మంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
09 AUG 2024 8:14AM by PIB Hyderabad
ఫ్రాన్స్ లోని పారిస్ లో ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్ లో జావెలిన్ ను విసిరే క్రీడాపోటీలో రజత పతకాన్ని గెలిచినందుకు శ్రీ నీరజ్ చోప్రాకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలను తెలియజేశారు.
వర్ధమాన క్రీడాకారులు ఎందరో వారి వారి కలలను సాకారం చేసుకొని, భారతదేశం గర్వపడేటట్లుగా చేస్తూ ఉండటానికి శ్రీ నీరజ్ నిరంతరం వారికి ప్రేరణను అందిస్తూ ఉండగలరన్న విశ్వాసాన్ని శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’లో ఒక సందేశంలో:
‘‘శ్రీ నీరజ్ చోప్రా లో శ్రేష్ఠత్వం మూర్తీభవించింది. ఆయన తన ప్రజ్ఞను పదే పదే నిరూపించుకుంటూ వస్తున్నారు. ఆయన మరొక ఒలింపిక్ పతకాన్నివెంటబెట్టుకొని స్వదేశానికి తిరిగివస్తున్నందుకు భారతదేశం ఉబ్బితబ్బిబ్బు అవుతోంది. రజతాన్ని గెలిచినందుకు ఆయనకు ఇవే అభినందనలు. వర్ధమాన క్రీడాకారులు ఎందరికో వారు వారి కలలను సాకారం చేసుకొని, భారతదేశం వారిని చూసుకొని గర్వపడేటట్లు చేయటానికి శ్రీ నీరజ్ నిరంతరం ప్రేరణనిస్తుంటారు. @Neeraj_chopra1’’ అని పేర్కొన్నారు.
***
DS/SR
(रिलीज़ आईडी: 2043557)
आगंतुक पटल : 78
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam