ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కల్పనలు - వాస్తవాలు
నీట్- పిజి 2024 పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్ పై మీడియా కథనాలు అవాస్తవం, తప్పుదోవ పట్టించేవి
డబ్బు ఇస్తే నీట్-పీజీ 2024 ప్రశ్నలను ఇస్తామంటూ అభ్యర్థులను మోసం చేసేందుకు ప్రయత్నించిన మోసగాళ్లు, వారి అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎన్ బి ఇ ఎం ఎస్
నీట్-పీజీ 2024 ప్రశ్నాపత్రాలను ఎన్ బి ఇ ఎం ఎస్ ఇంకా తయారు చేయలేదు: సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న ప్రచారం బూటకమని అభ్యర్థులందరికీ భరోసా
దరఖాస్తుదారులు ఇలాంటి అనైతిక శక్తుల ప్రచారంతో తప్పుదోవ పట్టకుండా , అటువంటి ఏజెంట్లు తమను సంప్రదిస్తే వెంటనే ఎన్ బిఇఎంఎస్ లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచన
Posted On:
07 AUG 2024 7:13PM by PIB Hyderabad
కొన్ని మీడియా నివేదికలు నీట్ పీజీ - 2024 పరీక్ష ప్రశ్నపత్రం లీక్ గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్ట్‌లను ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి. అటువంటి కథనాలు పూర్తి అవాస్తవం, తప్పుదోవ పట్టించేవి.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ -టెలిగ్రామ్ మెసెంజర్ ద్వారా కొందరు అనైతిక ఏజెంట్లు తప్పుడు, దొంగ ప్రచారం చేస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్టు వైద్య పరీక్షల జాతీయ బోర్డు (ఎన్ బి ఇ ఎంఎస్) తెలిసింది. రాబోయే నీట్-పీజీ 2024 పరీక్ష కోసం ప్రశ్నలను పెద్ద మొత్తం లో డబ్బు చెల్లిస్తే అందిస్తామని వారు అభ్యర్థులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.
నీట్-పీజీ 2024 ప్రశ్నల పేరుతో అభ్యర్థులను మోసం చేసేందుకు ప్రయత్నించిన ఇలాంటి మోసగాళ్లు, వారి సహచరులపై ఎన్ బి ఇ ఎంఎస్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
"నీట్-పిజి లీకైన మెటీరియల్" పేరుతో టెలిగ్రామ్ ఛానల్ లో చేసిన ఇటువంటి తప్పుడు వాదనలను ఎన్ బి ఇ ఎంఎస్ ఖండించింది. రాబోయే నీట్-పిజి 2024 లో ఇవే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించే ఇలాంటి మోసగాళ్ళ ప్రలోభాలకు గురికావద్దని / తప్పుదోవ పట్టవద్దని నీట్-పిజి 2024 దరఖాస్తుదారులను ఎన్ బి ఇ ఎంఎస్ హెచ్చరించింది.
నీట్-పీజీ 2024 ప్రశ్నపత్రాలను ఇంకా తయారు చేయలేదని , సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో పేపర్ లీకేజీ ఆరోపణలు అన్నీ బూటకమని ఎన్ బి ఇ ఎంఎస్ అభ్యర్థులందరికీ స్పష్టం చేసింది.
వాస్తవాలను ధృవీకరించకుండా ఎవరైనా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడటం లేదా పుకార్లను ప్రచురించడం / వ్యాప్తి చేయడం వంటివి చేస్తే ఎన్ బి ఇఎంఎస్ తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది.
ఎవరైనా దొంగ ఏజెంట్లు/ మోసగాళ్ళు తమ వద్దకు వచ్చి దొంగ ఇమెయిల్స్ / ఎస్ఎంఎస్ లేదా టెలిఫోన్ కాల్ లేదా నకిలీ పత్రాలు లేదా వ్యక్తిగతంగా లేదా సామాజిక మాధ్యమాల ద్వారా నీట్ యుజి పరీక్షకు ప్రశ్నపత్రాలను అందిస్తామని హామీ ఇస్తే అటువంటి మోసపూరిత ఏజెంట్లు / దళారుల గురించి తదుపరి దర్యాప్తు కోసం ఎన్ బి ఇఎంఎస్ కమ్యూనికేషన్ వెబ్ పోర్టల్: https://exam.natboard.edu.in/communication.php?page=main లేదా స్థానిక పోలీసులకు నివేదించాలని కోరింది.
****
(Release ID: 2043099)
Visitor Counter : 80