నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద 18 రకాల హస్త కళాకారులు చేతి వృత్తులవారికి సంపూర్ణ చేయూత


వారి సంప్రదాయ నైపుణ్య ఉన్నతీకరణ ఆధునికీకరణ

Posted On: 05 AUG 2024 1:04PM by PIB Hyderabad

   దేశంలోని 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల (యుటి)లో 18 రకాల హస్త కళాకారులు, చేతి వృత్తులవారికి సంప్రదాయ నైపుణ్య ఉన్నతీకరణ, ఆధునికీకరణ దిశగా ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద ప్రాథమిక నైపుణ్యాభివృద్ధి రూపేణా అధికారిక శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి సంబంధించి 2024 జూలై 19నాటికి రాష్ట్రాలు/యూటీల వారీగా అభ్యర్థుల సంఖ్య వివరాలు అనుంబంధం-1లో చూడవచ్చు.

  దేశవ్యాప్తంగా 18 రకాల హస్తకళాకారులు, చేతివృత్తుల నిపుణులకు చేయూత లక్ష్యంగా ‘పిఎం విశ్వకర్మ పథకం’ 17.09.2023న ప్రారంభమైంది. దీనికింద లబ్ధిదారులకు నైపుణ్యాభివృద్ధితోపాటు ‘పిఎం విశ్వకర్మ ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డు, పరికరాలపై ప్రోత్సాహకం, రుణ సహాయం, డిజిటల్ లావాదేవీల నిర్వహణకు ప్రోత్సాహకం, విక్రయ మద్దతు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సంప్రదాయక వృత్తిదారులను వ్యవస్థాపకులుగా ఎదిగేలా, స్వావలంబన సాధించేలా తోడ్పాటునివ్వడమే ఈ పథకం ప్రధానోద్దేశం. ఈ పథకం ద్వారా వారికి నైపుణ్యోన్నతి, ఆధునిక పరికరాలు-సాంకేతికతతో వారి వృత్తుల సంధానం... అంతిమంగా మెరుగైన జీవనోపాధి అవకాశాల కల్పన సాధ్యం కాగలవని ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నిటితోపాటు వారి ఉత్పత్తుల విక్రయాల కోసం  జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం బాధ్యతను కూడా ప్రభుత్వం స్వీకరిస్తుంది.

   కాగా, కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రా-నాగర్ హవేలీ, దమన్-దియ్యు సహా మహారాష్ట్ర పరిధిలో నమోదు, రిజిస్ట్రేషన్ల వివరాలు అనుబంధం-2లో చూడవచ్చు.

   దేశవ్యాప్తంగా 29.07.2024 నాటికి 56,526 దరఖాస్తులపై రూ.551.80 కోట్ల మేర, అలాగే రుణ సహాయం కింద 15,878 దరఖాస్తులకుగాను రూ.132.49 కోట్లదాకా రుణ పంపిణీ పూర్తయింది. నమోదు విజయవంతమైన 14.38 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులలో 9,05,328 మంది దరఖాస్తుదారులు మార్కెటింగ్ మద్దతు కోరారు.

   ఈ పథకాన్ని కేంద్ర సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఒఎంఎస్ఎంఇ), నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డిఇ), ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం (డిఎఫ్ఎస్) సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. దేశమంతటా ‘పిఎం విశ్వకర్మ’ పథకం సజావుగా అమలయ్యేలా పర్యవేక్షించే దిశగా ‘‘డిఎఫ్ఎస్‌, ఎంఎస్‌డిఇ, ఎంఒఎంఎస్ఎంఇ’ కార్యదర్శులు సహాధ్యక్షులుగాగల జాతీయ సారథ్యం సంఘం క్రమం తప్పకుండా సమావేశమై తగు నిర్ణయాలు తీసుకుంటుంది.

అనుబంధం-1

వ.సం

రాష్ట్రం/కేంద్రపాలి ప్రాంతం

ప్రాథమిక శిక్షణ ధ్రువపత్రం

పొందిన  అభ్యర్థుల సంఖ్య (2024 జూలై 19నాటికి)

1

ఆంధ్రప్రదేశ్

47,235

2

అస్సాం

28,169

3

బీహార్

3,966

4

చండీగఢ్

33

5

ఛత్తీస్‌గఢ్

14,621

6

ద‌మన్-దియ్యు; దాద్రా-నాగర్ హవేలీ

0

7

గోవా

2,464

8

గుజరాత్

81,542

9

హర్యానా

7,414

10

హిమాచల్ ప్రదేశ్

1,261

11

జమ్మూ కాశ్మీర్

82,514

12

జార్ఖండ్

8,722

13

కర్ణాటక

1,12,737

14

కేరళ

589

15

లడఖ్

1,032

16

మధ్యప్రదేశ్

17,316

17

మహారాష్ట్ర

37,413

18

మణిపూర్

715

19

నాగాలాండ్

227

20

ఒడిశా

6,922

21

పంజాబ్

1,560

22

రాజస్థాన్

25,166

23

తెలంగాణ

12,832

24

త్రిపుర

3,685

25

ఉత్తర ప్రదేశ్

16,477

26

ఉత్తరాఖండ్

3,223

 

మొత్తం

5,17,835

 

అనుబంధం-2

వ.సం

రాష్ట్రం/కేంద్రపాలి ప్రాంతం

నమోదు/అందిన దరఖాస్తుల సంఖ్య

విజయవంతంగా నమోదైనవారి సంఖ్య

1

దాద్రా-నాగర్ హవేలీ; ద‌మన్-దియ్యు

6,338

565

2

మహారాష్ట్ర

12,03,359

1,11,861

   కేంద్ర నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ జయంత్ చౌదరి నేడు లోక్‌స‌భ‌లో ఒక ప్రశ్నపై ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.

***


(Release ID: 2042484) Visitor Counter : 87