రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాష్ట్రపతితో వియత్నామ్ ప్రధాని సమావేశం

Posted On: 01 AUG 2024 9:29PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తో వియత్నామ్ ప్రధాని శ్రీ ఫామ్  మింగ్ చింగ్  గురువారం (2024, ఆగస్టు 1న) రాష్ట్రపతి భవన్ లో సమావేశమయ్యారు.

 

వియత్నామ్ ప్రధానిని రాష్ట్రపతి భారతదేశానికి ఆహ్వానిస్తూభారతదేశం-వియత్నామ్ సంబంధాలు సన్నిహిత సాంస్కృతికచరిత్రాత్మక లంకెల  దృఢ పునాదుల ఆధారంగా నిర్మాణం అయ్యాయనిపరస్పర నమ్మకంఅవగాహనఅంతర్జాతీయ వేదికలలో ఒక పక్షానికి మరొక పక్షం సహకరించుకొంటూ ఉండడం ఈ సంబంధాల విశిష్టత అని పేర్కొన్నారు.  భారతదేశం అమలుచేస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలిసీ’ లో ఒక కీలక స్తంభంగాను, మన ఇండో-పసిఫిక్ దార్శనికతలో ఒక ముఖ్య భాగస్వామ్య దేశంగాను వియత్నామ్ ఉందని రాష్ట్రపతి అన్నారు.

 

మన ద్వైపాక్షిక సంబంధాలు రాజకీయ ప్రధాన ఆదాన- ప్రదానాలు మొదలుకొని రక్షణ రంగ భాగస్వామ్యాలువ్యాపారంవాణిజ్యంపెట్టుబడులుఅభివృద్ధి సంబంధి  సహకారంసాంస్కృతిక సంబంధాలుఉభయ దేశాల ప్రజల మధ్య అనుసంధానం వంటి సహకారం ప్రధానమైన అనేక రంగాలకు విస్తరించడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి అన్నారు.

 

రెండు దేశాలు బౌద్ధ వారసత్వాన్నినాగరికతపరమైన సంబంధాలను పంచుకొంటున్నందుకువియత్నామ్ లో వారసత్వ స్థలాల సముద్ధరణ కు సమన్వయ పూర్వక ప్రయత్నాలు జరుగుతున్నందుకు ఇద్దరు నేతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

భారతదేశం-వియత్నామ్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టపరచడంలో ప్రధాని శ్రీ ఫామ్  మింగ్ చింగ్ పర్యటన ఎంతగానో తోడ్పడగలదని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

 

 

 

**


(Release ID: 2040625) Visitor Counter : 93