ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జీఎస్టీ పోర్టల్‌లో ఇకపై అందుబాటులో జీఎస్టీ వసూళ్లు, ఇతర సంబంధిత డేటా

Posted On: 01 AUG 2024 2:18PM by PIB Hyderabad

2024 జూలై నెలకు సంబంధించి రాష్ట్రాల వారీగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు (స్థూలనికర)ఐజీఎస్‌టీ సెటిల్‌మెంట్ సంబంధించిన నెలవారీ సమాచారాన్ని 'న్యూస్ అండ్ అప్డేట్స్విభాగం కింద జీఎస్టీ వెబ్‌సైట్ https://www.gst.gov.in లో పొందుపరిచారు. ఇకపై జీఎస్టీ వసూళ్ల డేటాను వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

 

అంతేకాకుండా కాలక్రమానుసారం 2017 నుంచి సీజీఎస్టీఎస్జీఎస్టీఐజీఎస్టీసెస్ ల డేటారాష్ట్రాల వారీగా జీఎస్టీ సేకరణరిటర్నుల సమర్పణకు సంబంధించిన డేటాను వెబ్‌సైట్ లోని 'డౌన్‌లోడ్స్విభాగంలోని 'జీఎస్టీ స్టాటిస్టిక్స్కింద క్రమం తప్పకుండా అప్‌డేట్ చేస్తున్నారు.

 

***


(Release ID: 2040608) Visitor Counter : 111