గనుల మంత్రిత్వ శాఖ
అల్యూమినియమ్ ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో అతి పెద్ద దేశంగా భారతదేశం
ఖనిజ ఉత్పత్తి 2024-25 ఆర్థిక సంవత్సరం ఒకటో త్రైమాసికంలో వృద్ధి చెందుతుందన్న ఆశ ఉంది
ఈ సంవత్సరం కీలక ఖనిజాల ఉత్పత్తిలో, అల్యూమినియమ్ ధాతువు ఉత్పత్తిలో పటిష్ట వృద్ధి
Posted On:
01 AUG 2024 12:12PM by PIB Hyderabad
దేశంలో కీలక ఖనిజాల ఉత్పత్తి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలకు చేరుకొన్న అనంతరం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో కూడా పటిష్ట వృద్ధిని కొనసాగించింది. మొత్తం ఎమ్‌సిడిఆర్ ఖనిజాల ఉత్పత్తిలో విలువ పరంగా చూసినప్పుడు ఒక్క ఇనుప ముడిఖనిజం, సున్నపురాయి లే దాదాపుగా 80 శాతం విలువ ను ప్రతిబింబించాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇనుప ముడిఖనిజం ఉత్పత్తి 275 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎమ్ఎమ్‌టి)గా, సున్నపురాయి ఉత్పత్తి 450 ఎమ్ఎమ్‌టి గా ఉండింది.
తాత్కాలిక సమాచారాన్ని పట్టి చూస్తే, 2024-25 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-జూన్) లో లోహేతర ధాతు (నాన్-ఫెరస్ మెటల్) రంగంలో ప్రాథమిక అల్యూమినియమ్ ఉత్పత్తి అంతకు ముందు సంవత్సరం ఇదే కాలం కన్నా 1.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-జూన్) లో 10.28 లక్షల టన్నులుగా ఉన్నది కాస్తా 2024-25 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-జూన్) లో 10.43 లక్షల టన్నుల (ఎల్‌టి) కు పెరిగింది.
ప్రపంచంలో భారతదేశం రెండో అతి పెద్ద అల్యూమినియమ్ ఉత్పత్తిదారుగాను, మూడో అతి పెద్ద సున్నం ఉత్పత్తిదారుగాను, నాలుగో అతిపెద్ద ఇనుప ముడిఖనిజం ఉత్పత్తిదారు దేశంగాను ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇనుప ముడిఖనిజం, సున్నపురాయిల ఉత్పత్తిలో నిరంతర వృద్ధి ఉక్కు పరిశ్రమ, సిమెంటు పరిశ్రమలల వంటి ఉపయోగకర్త పరిశ్రమల్లో గిరాకీ చాలా బలంగా ఉందని సూచిస్తోంది. వీటికి అల్యూమినియంలో వృద్ధిని కూడా కలిపితే, ఈ వృద్ధి ధోరణులు శక్తి (ఎనర్జీ), మౌలిక సదుపాయాలు, నిర్మాణం, ఆటోమోటివ్, మెషినరీ వంటి ఉపయోగకర్త రంగాలలో ఆర్థిక కార్యకలాపాల తీరు పటిష్టంగా ఉందన్న సంకేతాలను ఇస్తున్నాయి.
ఇనుప ముడిఖనిజం ఉత్పత్తి 2023-24 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-జూన్ మధ్య కాలం) లోని 72 ఎమ్ఎమ్‌టి స్థాయి నుంచి 9.7 శాతం వృద్ధి తో 2024-25 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-జూన్ మధ్య)లో 79 ఎమ్ఎమ్‌టి కి పెరిగింది. సున్నపురాయి ఉత్పత్తి 2023-24 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-జూన్ మధ్యకాలం)లోని 114 ఎమ్ఎమ్‌టి స్థాయి నుంచి 1.8 శాతం మేర వృద్ధి చెంది, 2024-25 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-జూన్ మధ్యకాలం)లో 116 ఎమ్ఎమ్‌టి కి చేరుకొంది. మాంగనీస్ ఖనిజం ఉత్పత్తి 2024-25 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-జూన్ మధ్య
కాలం)లో, అంతకు ముందు సంవత్సరం అదే కాలంలోని 0.9 ఎమ్ఎమ్‌టి కన్నా 11 శాతం అధికంగా 1.0 ఎమ్ఎమ్‌టి కి చేరింది.
***
(Release ID: 2040341)
Visitor Counter : 169
Read this release in:
English
,
Urdu
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada