యు పి ఎస్ సి

శ్రీమతి పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ తాత్కాలిక అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యు పి ఎస్ సి; భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షలు / ఎంపికల నుండి శాశ్వతంగా తొలగింపు


అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించిన తరువాత, శ్రీమతి ఖేడ్కర్ సిఎస్ఇ -2022 నిబంధనలను ఉల్లంఘించారని నిర్ధారించిన యు పి ఎస్ సి

2009 నుండి 2023 వరకు పదిహేను వేలకు పైగా సిఫార్సు చేసిన అభ్యర్థుల 15 సంవత్సరాల సిఎస్ఇ డేటా ను సమీక్షించిన యు పి ఎస్ సి

Posted On: 31 JUL 2024 3:18PM by PIB Hyderabad

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022 (సి ఎస్ ఇ-2022) తాత్కాలిక సిఫార్సు చేసిన అభ్యర్థి శ్రీమతి పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ తన గుర్తింపును తారుమారు చేయడం ద్వారా పరీక్ష నిబంధనలలో అనుమతించిన పరిమితికి మించి ఎక్కువ సార్లు మోసపూరతంగా అవకాశాలు ఉపయోగించు కున్నందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యు పి ఎస్ సి ) 2024 జూలై 18 న ఆమెకు షోకాజ్ నోటీసు (ఎస్.సిఎన్ ) జారీ చేసింది. షోకాజ్ నోటీసు కు ఆమె తన సమాధానాన్ని 2024 జూలై 25 లోగా సమర్పించాల్సి ఉండగా , అవసరమైన పత్రాలు పొందడం కోసం ఆమె ఆగస్టు నాల్గవ తేదీ వరకు గడువు ఇవ్వాలని కోరారు. 

2. శ్రీమతి పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ అభ్యర్థనను యు పి ఎస్. సి పరిశీలించిన అనంతరం న్యాయ సూత్రాలకు అనుగుణంగా 2024 జూలై 30 మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఆమెకు సమయం ఇచ్చింది, తద్వారా షోకాజ్ నోటీస్ పై ఆమె తన సమాధానం సమర్పించడానికి వీలు కల్పించింది.పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ కు ఇదే చివరి అవకాశమని, గడువు పొడిగింపును అనుమతించబోమని కూడా స్పష్టం చేసింది. పైన పేర్కొన్న తేదీ/సమయానికి ఎలాంటి స్పందన రాకపోతే, ఆమె నుంచి ఎలాంటి తదుపరి ప్రస్తావన రాకుండా యు పి ఎస్ సి తదుపరి చర్యలు తీసుకుంటుందని ఆమెకు స్పష్టంగా తెలియజేశారు. కాగా, గడువు పొడిగించినప్పటికీ నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వడంలో ఆమె విఫలమయ్యారు.

3. అందుబాటులో ఉన్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన యు పి ఎస్ సి  ఆమె సీఎస్ ఇ -2022 నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు గుర్తించింది. ఆమె సి ఎస్ ఇ -2022 తాత్కాలిక అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు యు పి ఎస్ అన్ని భవిష్యత్ పరీక్షలు / ఎంపికల నుండి ఆమెను శాశ్వతంగా తొలగించారు.

4.  శ్రీమతి పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ కేసు నేపథ్యంలో, 2009 నుండి 2023 వరకు అంటే 15 సంవత్సరాల పాటు సిఎస్ఇలకు సిఫార్సు చేసిన 15,000 మందికి పైగా అభ్యర్థుల లభ్యత డేటాను యు పి ఎస్. సి క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ సమగ్ర ప్రక్రియ తరువాత, శ్రీమతి పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ కేసు మినహా, మరే అభ్యర్థి కూడా సిఎస్ఇ నిబంధనల ప్రకారం అనుమతించిన దానికంటే ఎక్కువ ప్రయత్నాలు చేసినట్టు నిర్ధారణ కాలేదు.  శ్రీమతి పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ ఒక్క కేసులోమాత్రమే ఆమె తన పేరును మాత్రమే కాకుండా తన తల్లిదండ్రుల పేరును కూడా మార్చడం వల్ల ఆమె ప్రయత్నాల సంఖ్యను యు పి ఎస్ సి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఒపి ) గుర్తించలేకపోయింది. భవిష్యత్తులో ఇలాంటి కేసులు పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు ఎస్ ఒ పి మరింత పటిష్టం చేసే పనిలో యు పి ఎస్ సి ఉంది.

5. తప్పుడు సర్టిఫికెట్ల (ముఖ్యంగా ఒ బి సి , పి డబ్ల్యు బి డి ఓబీసీ, కేటగిరీలు) సమర్పణకు సంబంధించిన ఫిర్యాదులకు సంబంధించి - వాటిని తగిన అధికారి జారీ చేసిందా, సర్టిఫికెట్ కు సంబంధించిన సంవత్సరం, సర్టిఫికేట్ జారీ తేదీ, సర్టిఫికెట్ పై ఓవర్ రైటింగ్ ఏమైనా ఉందా,   సర్టిఫికేట్ ఫార్మాట్ మొదలైనవి మాత్రమే - యు పి ఎస్ సి ఇంతవరకు ప్రాథమిక పరిశీలన చేస్తోంది. సాధారణంగా ఆ సర్టిఫికేట్ ను కాంపిటెంట్ అథారిటీ జారీ చేసినట్లయితే దాన్ని అసలైనదిగా పరిగణిస్తారు. అభ్యర్థులు ప్రతి సంవత్సరం సమర్పించే వేలాది సర్టిఫికెట్ల వాస్తవికతను తనిఖీ చేసే ఆదేశం లేదా ఆధారం యు పి ఎస్ సి కి లేదు. అయితే సర్టిఫికెట్ల పరిశీలన, వెరిఫికేషన్ బాధ్యతలను వాటిని అప్పగించిన అధికారులే నిర్వహిస్తారు. 

 

***



(Release ID: 2039676) Visitor Counter : 70