హోం మంత్రిత్వ శాఖ

‘కార్గిల్ విజ‌య్ దివాస్’ సంద‌ర్భంగా మాతృభూమిని తమ శౌర్యంతో ర‌క్షించిన వీర సైనికుల‌కు నివాళులు అర్పించిన కేంద్ర హోం, స‌హ‌కార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ఆర్మీలోని వీర సైనికుల తిరుగులేని ప‌రాక్ర‌మానికి ‘కార్గిల్ విజ‌య్ దివాస్‌’ ప్ర‌తీక - శ్రీ అమిత్ షా

కార్గిల్ యుద్ధంలో వీర సైనికులు హిమాల‌యాల్లోని మ‌నుషులు చేరుకోలేని ప‌ర్వ‌తాల్లో త‌మ శౌర్యంతో శ‌త్రువును మోక‌రిల్లేలా చేసి, కార్గిల్‌లో మ‌ళ్లీ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసి దేశం గ‌ర్వ‌ప‌డేలా చేశారు.

వీర‌సైనికుల త్యాగం, అంకిత‌భావం, బ‌లిదానాల‌ను కృత‌జ్ఞ‌త‌గ‌ల‌ మ‌న‌ దేశం ఎప్ప‌టికీ మ‌రిచిపోదు

Posted On: 26 JUL 2024 2:24PM by PIB Hyderabad

త‌మ శౌర్యంతో మాతృభూమిని ర‌క్షించిన వీర సైనికుల‌కు ‘కార్గిల్ విజ‌య్ దివాస్’ సంద‌ర్భంగా ఇవాళ కేంద్ర హోం, స‌హ‌కార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నివాళులు అర్పించారు.

ఆర్మీ వీర సైనికుల తిరుగులేని ప‌రాక్ర‌మానికి ‘కార్గిల్ విజ‌య్ దివాస్’ ప్ర‌తీక అని శ్రీ అమిత్ షా సామాజిక మాధ్య‌మం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధంలో వీర సైనికులు హిమాల‌యాల్లోని మ‌నుషులు చేరుకోలేని ప‌ర్వ‌తాల్లో త‌మ శౌర్యాన్ని ప్ర‌ద‌ర్శించి, శ‌త్రువును మోక‌రిల్లేలా చేశార‌ని, కార్గిల్‌లో మ‌ళ్లీ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసి దేశం గ‌ర్వ‌ప‌డేలా చేశార‌ని అన్నారు. కృత‌జ్ఞ‌తగ‌ల మ‌న దేశం వీర సైనికుల త్యాగాన్ని, అంకిత‌భావాన్ని, బ‌లిదానాలను ఎప్ప‌టికీ మ‌రిచిపోద‌ని పేర్కొన్నారు.

*****

RK / VV / ASH / PS



(Release ID: 2037479) Visitor Counter : 18