పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ గోపి
Posted On:
11 JUN 2024 5:16PM by PIB Hyderabad
పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సహాయమంత్రిగా కేరళలోని త్రిసూర్ పార్లమెంటు సభ్యుడు శ్రీ సురేష్ గోపి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. వివిధ రంగాలలో ప్రభావవంతమైన వ్యక్తిగా ఉన్న శ్రీ గోపి, తన పూర్వీకుడు శ్రీ రామేశ్వర్ తేలీని అనుసరించి ఈ పాత్రలోకి అడుగు పెట్టారు.
పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి, శ్రీ గోపికి సాదర స్వాగతం పలికారు.
1958 జూన్ 26న కేరళలోని అలప్పుజలో జన్మించిన గోపీకి అటు వినోద రంగంలోనూ, ఇటు ప్రజాసేవలోనూ విశిష్టమైన కెరీర్ ఉంది. కొల్లం లోని ఫాతిమా మాతా నేషనల్ కాలేజీ నుంచి జువాలజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, ఇంగ్లీష్ లిటరేచర్ లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ నామినేటెడ్ సభ్యుడిగా పనిచేసిన ఆయన పర్యావరణ సమస్యలు, సామాజిక న్యాయంపై వాదించడంలో దిట్ట.
దాతృత్వం, సామాజిక సేవ పట్ల ఆయనకున్న నిబద్ధతే గోపి రాజకీయ రంగప్రవేశం. 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) తరపున త్రిస్సూర్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రిగా ఆయన నియామకం ఈ కీలకమైన రంగాన్ని పర్యవేక్షించే ఆయన సామర్థ్యాలపై ప్రభుత్వానికి ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది.
సురేష్ గోపి తన విభిన్న అనుభవాలు మరియు ప్రజా సేవ పట్ల అభిరుచిని పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు, ఈ రంగంలో సృజనాత్మకత మరియు సామర్థ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఉన్నారు.
(Release ID: 2036845)
Visitor Counter : 41