హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ రోజు న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో మరోసారి కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ అమిత్ షా

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశం, దేశ ప్రజల భద్రతకు ఎప్పటిలాగే కట్టుబడి ఉంటుంది - శ్రీ అమిత్ షా

మోడీ 3.0 భారత భద్రత కోసం తన ప్రయత్నాలను తదుపరి స్థాయికి తీసుకువెళుతుంది. ఉగ్రవాదం, తిరుగుబాటు, నక్సలిజానికి వ్యతిరేకంగా భారతదేశాన్ని ఒక రక్షణ కవచంగా నిర్మిస్తుంది

ఈ రోజు జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద అమరులైన పోలీసు సిబ్బందికి నివాళులు అర్పించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా

Posted On: 11 JUN 2024 5:40PM by PIB Hyderabad

శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో కేంద్ర హోం మంత్రిగా మరోసారి బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఎప్పటిలాగే దేశం మరియు దాని ప్రజల భద్రతకు కట్టుబడి ఉంటుందని శ్రీ అమిత్ షా 'ఎక్స్' పై తన పోస్ట్లో పేర్కొన్నారు. మోడీ 3.0 భారతదేశ భద్రత కోసం తన ప్రయత్నాలను తదుపరి స్థాయికి తీసుకువెళుతుందని, ఉగ్రవాదం, తిరుగుబాటు మరియు నక్సలిజానికి వ్యతిరేకంగా భారతదేశాన్ని ఒక రక్షణ కవచంగా నిర్మిస్తుందని కేంద్ర హోం మంత్రి అన్నారు.

 

IMG_9904 (1)

Under the stewardship of PM Shri @narendramodi Ji, I reassumed charge of the Ministry of Home Affairs today. The MHA will remain committed to the security of the nation and its people, as it always has been. Modi 3.0 will take its efforts for India's security to the next level… pic.twitter.com/o6VWIr76VY

— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) June 11, 2024

 

అంతకుముందు కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద అమరులైన పోలీసు సిబ్బందికి నివాళులు అర్పించారు. దేశ గౌరవాన్ని కాపాడుతూ ప్రాణాలర్పించిన మన పోలీసు దళాల అమరవీరులను స్మరించుకుంటూ, వారి త్యాగాల గాథ దేశభక్తిని ఎప్పటికీ చిరస్మరణీయం చేస్తుందన్నారు.

 

VIS03019

072A8966

Remembering the martyrs of our police forces who laid down their lives guarding the honor of the nation and whose saga of sacrifice immortalised the fervour of patriotism forever.

Paid floral tributes in their memory at the National Police Memorial. pic.twitter.com/ph6haOJiUz

— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) June 11, 2024

 

 

*****


(Release ID: 2036803) Visitor Counter : 59