రక్షణ మంత్రిత్వ శాఖ
‘త్రిపుట్’ ప్రారంభం
రెండు అదనపు పి1135.6 అనుసరణ నావలలో మొదటిది ఇది
Posted On:
24 JUL 2024 10:32AM by PIB Hyderabad
భారతీయ నౌకాదళం కోసం గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ (జిఎస్ఎల్) నిర్మిస్తున్న రెండు ఉన్నత యుద్ధ నావలలో ఒకటో యుద్ధ నావను గోవా లోని జిఎస్ఎల్ లో మంగళవారం ప్రారంభించడమైంది. సముద్ర సంబంధ సంప్రదాయానికి అనుగుణంగా, గోవా గౌరవనీయ గవర్నర్ శ్రీ పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై సమక్షంలో అధర్వ వేదోచ్చారణ మధ్య జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీమతి రీటా శ్రీధరన్ ఈ నావను ప్రారంభించారు. శక్తివంతమైన బాణం పేరు ‘త్రిపుట్’ నే ఈ నావకు పెట్టడమైంది. ఇది భారతీయ నౌకాదళానికి ఉన్న అజేయ స్ఫూర్తికి మరియు సుదూర లక్ష్యాన్ని, బాగా లోతైన లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యానికి ప్రతినిధిత్వాన్ని వహిస్తుంది.
త్రిపుట్ శ్రేణి ఉన్నత యుద్ధ నావలు రెండింటి నిర్మాణానికి ఉద్దేశించిన ఒప్పందం పైన రక్షణ మంత్రిత్వ శాఖ , గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ లు 2019 జనవరి 25న సంతకాలు చేశాయి. ఈ నావను శత్రు ఉపరితలాలపై సంచరించే నౌకలు, జలాంతర్గాములు, విమాన సముదాయాలకు వ్యతిరేకంగా యుద్ధ నిర్వహణ కోసం రూపొందించడమైంది. త్రిపుట్ శ్రేణి కి చెందిన నావలు 124.8 మీటర్ ల పొడవుతోను, 15.2 మీటర్ ల వెడల్పుతోను ఉంటాయి. ఈ నావలు సముద్ర జలాల్లో మునిగే భాగం 4.5 మీటర్ ల మేర ఉంటుంది. వీటి స్థానభ్రంశం సుమారు 3600 టన్నులు, వీటి వేగం సముద్రమార్గంలో గరిష్ఠంగా 28 మైళ్ళ మేరకు ఉంటుంది. ఈ నావల్లో గుప్త మారణాస్త్రాలు, ఉన్నత ఆయుధాలు, సెన్సర్ లు, ప్లాట్ ఫార్మ్ నిర్వాహక వ్యవస్థలు అమర్చి ఉంటాయి.
జిఎస్ఎల్ లో నిర్మాణంలో ఉన్న త్రిపుట్ శ్రేణి నావలు, రష్యా నుంచి సేకరించిన తేగ్, తల్వార్ శ్రేణి నావల అనుసరణ నౌకల శ్రేణికి చెందినవి. ఈ యుద్ధనావలను ఓ భారతీయ నౌకానిర్మాణ కేంద్రం లో దేశీయ పరిజ్ఞానంతో మొట్టమొదటిసారిగా నిర్మించడం జరుగుతోంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమానికి అనుగుణంగా, ఆయుధాలు, సెన్సర్ లు సహా అమర్చిన అనేక ఉపకరణాలలో భీమభాగం దేశవాళీ మూలాలను కలిగి ఉన్నవే కావడం తో, సదరు సామగ్రిని భారతీయ తయారీ విభాగాలే అందిస్తుతున్నాయి. దీనితో దేశంలో ఒక పక్క ఉపాధి కల్పనకు, మరో పక్క సామర్థ్యం పెంపుదలకు అవకాశాలు ఏర్పడ్డాయి.
***
(Release ID: 2036616)
Visitor Counter : 140