నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

మహిళల కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రం

Posted On: 24 JUL 2024 3:19PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ స్కిల్ ఇండియా మిషన్ (ఎస్ఐం) కింద నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (ఎంఎస్డీఈ) నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు/కళాశాలలు/సంస్థలు మొదలైన విస్తృత యంత్రాంగంతో ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై), జన్ శిక్షణ్ సంస్థాన్ (జేఎస్ఎస్), నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్ఏపీఎస్), కళాకారుల శిక్షణ పథకం (సీటీఎస్) వంటి వివిధ పథకాల కింద పారిశ్రామిక శిక్షణ సంస్థల (ఐటీఐల) ద్వారా మహిళలు సహా దేశవ్యాప్తంగా సమాజంలోని అన్ని వర్గాలకు నైపుణ్యం, కొత్త నైపుణ్యాలు, నైపుణ్యోన్నతుల్లో శిక్షణ అందిస్తుంది.

పీఎంకేవీవై కింద మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి భోజన & వసతి సౌకర్యాల కోసం రవాణా వ్యయం, ఖర్చులను అందిస్తారు. జేఎస్ఎస్ పథకం కింద మహిళలు, ఇతర బలహీన వర్గాలపై దృష్టి సారిస్తున్నారు. అన్ని ఐటీఐల్లో (ప్రభుత్వ, ప్రైవేటు) అన్ని కోర్సుల్లో మహిళా అభ్యర్థులకు 30 శాతం సీట్లను కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సాధారణ రిజర్వేషన్ విధానం ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేయవచ్చు. మహిళల కోసం ప్రత్యేకంగా 19 జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థలు (ఎన్ఎస్టీఐ), 300 కు పైగా ఐటీఐలు ఉన్నాయి.

ఎంఎస్ డీఈ ప్రారంభమైనప్పటి నుంచి 2024 జూన్ వరకు ఈ పథకం కింద శిక్షణ పొందిన మొత్తం అభ్యర్థుల్లో 36.59% మంది మహిళలు ఉన్నారు. జేఎస్ఎస్, పీఎంకేవీవైలు స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు. వాటిలో మహిళల భాగస్వామ్యం వరుసగా 82.01%, 44.30% ఉంది.

డిమాండ్ ను అంచనా వేసి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రాల వారీగా మహిళల కోసం ప్రత్యేకంగా ఎన్ఎస్ టీఐలు, మొత్తం ఐటీఐలు, మహిళా ఐటీఐల సంఖ్య అనుబంధం-1లో ఉన్నది.

అనుబంధం-I

రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఎన్ఎస్టీఐలు, ఐటీఐ కేంద్రాల సంఖ్య (30.06.2024 నాటికి):

 

క్ర.సం.

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

ఎన్ఎస్టీఐ(మహిళల కోసం)

మొత్తం ఐటీఐలు (ప్రభుత్వ, ప్రైవేటు)

మొత్తం ఐటీఐలు

ప్రత్యేకంగా మహిళల కోసం

1

అండమాన్, నికోబార్ దీవులు

0

4

0

2

ఆంధ్రప్రదేశ్

0

521

6

3

అరుణాచల ప్రదేశ్

0

7

1

4

అస్సాం

0

46

4

5

బిహార్

1

1377

45

6

ఛండీగఢ్

0

2

1

7

ఛత్తిస్ గఢ్

0

232

2

8

ఢిల్లీ

0

53

5

9

గోవా

1

13

1

10

గుజరాత్

1

503

19

11

హర్యానా

1

389

22

12

హిమాచలప్రదేశ్

1

270

12

13

జమ్మూ కశ్మీర్

1

50

6

14

జార్ఖండ్

0

348

13

15

కర్ణాటక

1

1504

17

16

కేరళ

1

464

16

17

లఢాఖ్

0

3

1

18

లక్షద్వీప్

0

1

0

19

మధ్యప్రదేశ్

1

1077

14

20

మహారాష్ట్ర

1

1042

16

21

మణిపూర్

0

10

1

22

మేఘాలయ

1

8

2

23

మిజోరాం

0

3

0

24

నాగాలాండ్

0

9

0

25

ఒడిషా

0

525

1

26

పుదుచ్చేరి

0

15

1

27

పంజాబ్

1

351

38

28

రాజస్థాన్

1

1620

9

29

సిక్కిం

0

4

0

30

తమిళనాడు

1

503

10

31

తెలంగాణ

1

302

4

32

దాద్రా & నాగర్ హవేలీ; డామన్ & డయ్యూ

0

4

0

33

త్రిపుర

1

22

1

34

ఉత్తరప్రదేశ్

2

3263

46

         

 



(Release ID: 2036610) Visitor Counter : 9