ఆర్థిక మంత్రిత్వ శాఖ

అన్ని వర్గాల పెట్టుబడిదారులకు 'ఏంజెల్ ట్యాక్స్' రద్దు


విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను 35 శాతానికి తగ్గింపు

ఆర్థిక రంగ విజన్ అండ్ స్ట్రాటజీ పత్రం విడుదల

క్లైమేట్ ఫైనాన్స్ కోసం వర్గీకరణ

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నియమనిబంధనలు సరళీకృతం.

దేశీయ క్రూయిజ్ లను నడిపే విదేశీ షిప్పింగ్ కంపెనీలకు సరళమైన పన్ను విధానం

Posted On: 23 JUL 2024 1:11PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2024-25 కేంద్ర బడ్జెట్ లో అన్ని వర్గాల పెట్టుబడిదారులకు 'ఏంజెల్ ట్యాక్స్' ను రద్దు చేయాలని ప్రతిపాదించారు. భారత స్టార్టప్ ఎకో సిస్టమ్ ను బలోపేతం చేయడం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల స్ఫూర్తిని పెంపొందించడం, ఇన్నోవేషన్ కు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

 

భారతదేశ అభివృద్ధి అవసరాల కోసం విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటును 40 శాతం నుండి 35 శాతానికి తగ్గించాలని మంత్రి ప్రతిపాదించారు.

 

ఆర్థిక వ్యవస్థ ఫైనాన్సింగ్ అవసరాలను తీర్చడానికి,  పరిమాణం, సామర్థ్యం , నైపుణ్యాల పరంగా ఈ రంగాన్ని సిద్ధం చేయడానికి ఆర్థిక రంగ విజన్ , స్ట్రాటజీ డాక్యుమెంట్ ను తీసుకురానున్నట్లు శ్రీమతి సీతారామన్ ప్రకటించారు. ఇది రాబోయే ఐదేళ్లకు ఎజెండాను నిర్ణయిస్తుందని, ప్రభుత్వం, రెగ్యులేటర్లు, ఆర్థిక సంస్థలు , మార్కెట్ భాగస్వాముల పనితీరుకు మార్గనిర్దేశం చేస్తుందని ఆమె అన్నారు.

క్లైమేట్ ఫైనాన్స్ కోసం వర్గీకరణను అభివృద్ధి చేయాలని మంత్రి ప్రతిపాదించారు. ఇది వాతావరణ అనుసరణ , ఉపశమనానికి మూలధన లభ్యతను పెంచుతుందని భావిస్తున్నారు, ఇది భారతదేశ వాతావరణ కట్టుబాట్లు , హరిత మార్పు ను సాధించడంలో సహాయపడుతుంది.

విమానాలు, నౌకలను లీజుకు ఇవ్వడానికి సమర్థవంతమైన, సౌకర్యవంతమైన విధానాన్ని అందించడానికి, 'వేరియబుల్ కంపెనీ స్ట్రక్చర్' ద్వారా ప్రైవేట్ ఈక్విటీ నిధులను సమీకరించడానికి అవసరమైన చట్టపరమైన అనుమతిని తమ ప్రభుత్వం కోరుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సులభతరం చేయడానికి, ప్రాధాన్యతను పెంచడానికి , విదేశీ పెట్టుబడులకు భారతీయ రూపాయిని కరెన్సీగా ఉపయోగించే అవకాశాలను ప్రోత్సహించడానికి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు , విదేశీ పెట్టుబడుల నియమనిబంధనలను సరళతరం చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

పెద్ద సంఖ్యలో నైపుణ్యం కలిగిన కార్మికులకు ఉపాధి కల్పించే డైమండ్ కటింగ్ , పాలిషింగ్ పరిశ్రమ అభివృద్ధిని ప్రోత్సహించడానికి, ముడి వజ్రాలను విక్రయించే విదేశీ మైనింగ్ కంపెనీలకు సేఫ్ హార్బర్ రేట్లను అందించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

దేశంలో దేశీయ క్రూయిజ్ లను నిర్వహిస్తున్న విదేశీ షిప్పింగ్ కంపెనీలకు సరళమైన పన్ను విధానాన్ని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. క్రూయిజ్ టూరిజం అద్భుతమైన సామర్థ్యాన్ని గ్రహించడానికి,  దేశంలో ఉపాధిని సృష్టించే ఈ పరిశ్రమకు ఊతమివ్వడానికి ఇది సహాయపడుతుంది.

 

***



(Release ID: 2036149) Visitor Counter : 29