సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వ శకం పై గ్రంథం.


‘ పవర్‌ వితిన్‌ : లీడర్‌షిప్‌ లెగసీ ఆఫ్‌ నరేంద్రమోదీ’ ( అంతర్లీన శక్తి : శ్రీనరేంద్ర మోదీ నాయకత్వ శకంపై) పుస్తకం,ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వ ప్రస్థానాన్ని పాశ్చాత్య, భారతీయ దృష్టికోణంలోంచి మన ముందుంచుతుంది.

Posted On: 21 JUL 2024 5:03PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వ శకంపై ప్రముఖ మేధావి, రచయిత, అమెరికాలోని కార్నెల్‌ యూనివర్సిటీ  రోడ్స్‌ పూర్వ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆర్‌. బాలసుబ్రమణియం రచించిన ‘ పవర్‌   వితిన్‌ : లీడర్‌షిప్‌ లెగసీ ఆఫ్‌ నరేంద్రమోదీ’  పుస్తకాన్ని,  ఆదివారం, న్యూ ఢల్లీి లో, కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌కు బహుకరించారు. డాక్టర్‌ ఆర్‌.బాలసుబ్రమణియం భారత ప్రభుత్వానికి చెందిన సామర్ధ్యాల నిర్మాణ కమిషన్‌ లో హెచ్‌.ఆర్‌. సభ్యులుగా ఉన్నారు.


ౖౖ‘‘‘ పవర్‌   వితిన్‌ : లీడర్‌షిప్‌ లెగసీ ఆఫ్‌ నరేంద్రమోదీ’  పుస్తకం ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ నాయకత్వ శకాన్ని తెలియజేయడంతోపాటు, పాశ్చాత్య, భారతీయ దృష్టికోణం లోనుంచి దీనిని వ్యాఖ్యానించడంతో పాటు, ప్రజాసేవా రంగంలోకి వచ్చేవారికి ఇదొక మార్గసూచిగా ఉండనుంది.
డాక్టర్‌ ఆర్‌.బాలసుబ్రమణియం, గతంలో తొమ్మిది గ్రంథాలను రాశారు. అందులో ‘‘వాయిసెస్‌ ఫ్రం ద గ్రాస్‌ రూట్స్‌’’, ‘‘లీడర్‌షిప్‌ లెసన్స్‌ ఫర్‌ డైలీ లివింగ్‌ ’’ వంటివి అంతర్జాతీయంగా బహుళ ప్రశంసలు పొందాయి.


‘‘ పవర్‌   వితిన్‌ : లీడర్‌షిప్‌ లెగసీ ఆఫ్‌ నరేంద్రమోదీ’’ గ్రంథం, ప్రధానమంత్రి అందించిన నాయకత్వ ప్రేరణతో రూపుదిద్దుకున్నది.  భారతీయ నాగరికతలోని ఈ గొప్పతనాన్ని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అనుభవాల లోంచి ఇది ఆత్మావలోకనం చేస్తుంది.
శ్రీ నరేంద్రమోదీ నిరంతర శ్రమ, భావ వ్యక్తీకరణ విధానం ఆయనను ప్రధానమంత్రి స్థాయికి ఎలా తీసుకువచ్చాయో కేబినెట్‌ లోపల , వెలుపలా ఉన్న ఆయన సహచరులు వెల్లడిరచారు.


మేధావులు, విద్యావంతులు, కార్పొరేట్‌ రంగానికి చెందిన వారు, ఇలా వివిధ జీవన రంగాలకు చెందిన ప్రముఖుల అభిప్రాయాలు, జ్ఞాపకాలు కూడా ఇందులో ఉన్నాయి.
ఈ గ్రంథం శ్రీ నరేంద్రమోడీ శకాన్ని, ఆయన ముద్రను, ఈ కాలపు విశేషాలను ప్రతిబింబించడంతోపాటు, భారతదేశాన్ని అంతర్జాతీయ వేదికపై కీలకపాత్రధారిగా చేయాలన్న ప్రధానమంత్రి సంకల్పాన్ని ఈ గ్రంథం మన ముందుంచుతుందని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు.  ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నేపథ్యంగా భారతీయ నాయకత్వ చిత్రణను అత్యంత సాధికారికంగా ప్రతిబింబింప చేసిన గ్రంథంగా దీనిని ఆయన పేర్కొన్నారు. ఒకరకంగా ఇది ఒక  కేస్‌ స్టడీ అని, భవిష్యత్‌ పరిశోధకులు తమ రెఫరెన్సుకు దీనిని ఉపయోగించుకుంటారని ఆయన పేర్కొన్నారు.

***


(Release ID: 2035249) Visitor Counter : 65