ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేరళలోని మలప్పురం జిల్లాలో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యాధిగ్రస్తుడు మృతికి నిఫా వైరస్ కారణమని నిర్ధారించిన పూణే ఎన్ఐవి


వ్యాధి నివారణకు తక్షణ ప్రజారోగ్య చర్యలు చేపట్టాలని కేంద్రం సూచన

కేసు ఇన్వెస్టిగేషన్, ఎపిడెమియోలాజికల్ మూలాన్ని గుర్తించడం, సాంకేతిక మద్దతు అందించడానికి,
రాష్ట్రానికి సహాయం చేసేందుకు ఉమ్మడి వ్యాప్తి ప్రతిస్పందన కేంద్ర బృందం మోహరింపు

Posted On: 21 JUL 2024 3:29PM by PIB Hyderabad

నిఫా వైరస్ సోకిన కేసు కేరళలోని మలప్పురం జిల్లాలో బయటపడింది. మలప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడుకి ఏఈఎస్ లక్షణాలు కనిపించాయి. కోజికోడ్‌లోని ఉన్నత ఆరోగ్య కేంద్రానికి బదిలీ చేయడానికి ముందు పెరింతల్మన్నలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో చేర్చారు. అయితే ఆ తర్వాత వ్యాధి సోకిన రోగి మృతి చెందాడు. నమూనాలను పూణేలోని ఎన్‌ఐవికి పంపగా నిపా వైరస్ సోకడంతో ఈ మరణం చోటుచేసుకుందని నిర్ధారించారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవలసిన తక్షణ ప్రజారోగ్య చర్యలను కేంద్రం సూచించింది:

  • ధృవీకరణ అయిన కేసుకి  సంబంధించిన కుటుంబం, పరిసర ప్రాంతం, సారూప్య స్థలాకృతి ఉన్న ప్రాంతాలలో యాక్టివ్ కేసు శోధన.
  • గత 12 రోజులలో యాక్టివ్ కాంటాక్ట్ ట్రేసింగ్ (ఎక్కడ కాంటాక్ట్ అయినా).
  • వ్యాధిగ్రస్తులకు కాంటాక్ట్ లోకి వచ్చిన వారికి కఠినమైన నిర్బంధం, ఎవరైనా అనుమానితులను ఒంటరిగా ఉంచడం.
  • ప్రయోగశాల పరీక్ష కోసం నమూనాల సేకరణ, రవాణా.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాతీయ 'వన్ హెల్త్ మిషన్' నుండి బహుళ-సభ్య జాయింట్ రెస్పాన్స్ టీమ్ ని నియమించారు. ఈ బృందం కేసును దర్యాప్తు చేయడంలో, ఎపిడెమియోలాజికల్ కారణాలను గుర్తించడంలో, సాంకేతిక సహాయం అందించడంలో రాష్ట్రానికి మద్దతు ఇస్తుంది. 

అదనంగా, రాష్ట్ర అభ్యర్థన మేరకు, రోగి నిర్వహణ కోసం ఐసిఎంఆర్ మోనోక్లోనల్ యాంటీబాడీలను పంపింది. కాంటాక్టుల నుండి అదనపు నమూనాలను పరీక్షించడానికి మొబైల్ బిఎస్ఎల్-3 ప్రయోగశాల కోజికోడ్‌కు చేరుకుంది. రోగి చనిపోయే ముందే  మోనోక్లోనల్ యాంటీబాడీస్  మోనోక్లోనల్ యాంటీబాడీస్ చేరుకుంది కానీ రోగి  సాధారణ పరిస్థితి సరిగా లేనందున వినియోగించలేదు.

నిపా వైరస్ వ్యాధి (ఎన్ఐవిడి) వ్యాప్తి గతంలో కూడా కేరళలో నమోదైంది. ఇటీవల 2023లో కోజికోడ్ జిల్లాలో సంభవించింది. పళ్ళు, గబ్బిలాలు వల్ల వైరస్  వ్యాపిస్తుంది. మానవులు ప్రమాదవశాత్తూ గబ్బిలం వల్ల కలుషితమైన పండ్లను తినడం ద్వారా వ్యాధి బారిన పడవచ్చు.

***


(Release ID: 2034863) Visitor Counter : 85