ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాంప్రదాయక హల్వా వేడుకతో న్యూఢిల్లీలో కేంద్ర బడ్జెట్ 2024-25 చివరి దశ సన్నాహాలు నేడు ప్రారంభం

Posted On: 16 JUL 2024 7:26PM by PIB Hyderabad

2024-25 కేంద్ర బడ్జెట్ కోసం బడ్జెట్ తయారీ ప్రక్రియ చివరి దశను సూచించే హల్వా వేడుకను న్యూఢిల్లీలో నేడు నిర్వహించారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది.

 

బడ్జెట్ తయారీలో నిమగ్నమైన అధికారుల ‘లాక్-ఇన్’ ప్రక్రియ ప్రారంభమవడానికి ముందు ఏటా సాంప్రదాయక హల్వా వేడుకను నిర్వహిస్తారు. 2024-25 కేంద్ర బడ్జెట్ ను 2024 జూలై 23న ప్రవేశపెట్టనున్నారు.

వార్షిక ఆర్థిక ప్రకటన (బడ్జెట్), డిమాండ్ గ్రాంట్లు, ఆర్థిక బిల్లు మొదలైనవి సహా అన్ని కేంద్ర బడ్జెట్ పత్రాలు ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్’లో కూడా అందుబాటులో ఉంటాయి. సులభమైన సాంకేతిక సౌలభ్యాల ద్వారా పార్లమెంటు సభ్యులు, సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకుండా బడ్జెట్ పత్రాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ యాప్ రెండు భాషల్లో (ఇంగ్లిష్, హిందీ); ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండు వేదికల్లో అందుబాటులో ఉంటుంది. కేంద్ర బడ్జెట్ వెబ్ పోర్టల్ నుంచి కూడా ఈ యాప్ ను (www.indiabudget.gov.in) డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

 

2024 జూలై 23 న పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత బడ్జెట్ పత్రాలు మొబైల్ యాప్ లో అందుబాటులో ఉంటాయి.

 

 

హల్వా వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి వెంట ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శులు, బడ్జెట్ తయారీలో పాల్గొన్న భారత ప్రభుత్వ ఇతర సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. వేడుకలో భాగంగా, కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రెస్ ను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించడంతో పాటు సంబంధిత అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.

***


(Release ID: 2033930) Visitor Counter : 210