హోం మంత్రిత్వ శాఖ

మధ్య ప్రదేశ్ లోని 55 జిల్లాల్లో 486 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ‘ప్రధాన మంత్రి శ్రేష్ఠ కళాశాలల’ను ప్రారంభించిన కేంద్ర హోం శాఖ, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


బలమైన పునాదులు కలిగిన విద్య లేకుంటే 2047 కల్లా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం సాధ్యపడదు

రాబోయే 25 సంవత్సరాలలో అన్ని అవసరాలను తీర్చగలిగే కొత్త విద్యా విధానాన్ని తీసుకురావడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముందుచూపుతో పని చేశారు

డిగ్రీలను ప్రదానం చేయడానికి బదులు యువత సంపూర్ణ అభివృద్ధికి నూతన విద్యా విధానం ప్రాధాన్యతనిస్తుంది

నూతన విద్యా విధానంలో, బాలలకు ‘విద్యా విషయ ప్రధాన పాఠ్యప్రణాళిక’తో పాటు ‘జీవిత సంబంధమైన పాఠ్యప్రణాళిక’ను కూడా బోధించడం జరుగుతుంది

నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థులలో ‘సాంప్రదాయక ఆలోచన విధానాని’కి బదులుగా, ‘సరికొత్తగా ఆలోచించే అలవాటు’ను పెంపొందింప చేయడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతుంది

నేటి తరానికి చెందినవారు ఇంటర్ నెట్, కృత్రిమ మేధ (ఎఐ), డేటా ఎనలిటిక్స్ ల తరం; కాబట్టి ఆచరాణాత్మకమైన, నైపుణ్యాభివృద్ధి ప్రధానమైన, వృత్తి సంబంధమైన శిక్షణ వంటి అంశాలను కొత్త విద్యా విధానంలో చేర్చడమైంది

జీవితంలో గెలవాలంటే ఒక లక్ష్యం ఉండాలి; లక్ష్యమంటూ ఉండని జీవితం లో కాలం వృథా అవుతుంది; యువత తమకంటూ లక్ష్యాలను నిర్దేశించుకొని, ఆ లక్ష్యాలను సాధిం

Posted On: 14 JUL 2024 8:14PM by PIB Hyderabad

మధ్య ప్రదేశ్ లో ఉన్న 55 జిల్లాలు అన్నింటిలో ప్రధాన మంత్రి శ్రేష్ఠ కళాశాలల’ (ప్రధాన మంత్రి కాలేజెస్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) ను కేంద్ర హోంసహకార శాఖ ల మంత్రి శ్రీ అమిత్ షా ఇండోర్ లో ఈ రోజు ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్కేంద్ర మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకుర్ లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 

 

 

 

ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగిస్తూమనం స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తి చేసుకునే 2047 నాటికి ప్రపంచంలో ప్రతి రంగంలోనూ అగ్రస్థానాన నిలచే భారతదేశాన్ని ఆవిష్కరించాలి అనే లక్ష్యాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించారు అని పేర్కొన్నారు.  ఈ లక్ష్యాన్ని సాధించాలంటేవిద్య రంగం లో పునాదిని ప్రబలమైందిగా మలచుకోనిదే సాధ్యమయ్యే పని కాదుకాబట్టి నరేంద్ర మోదీ గారు  ముందుచూపు తో నూతన విద్యా విధానాన్ని 2020లో పరిచయం చేశారు అని శ్రీ అమిత్ షా అన్నారు.  రాగల 25 సంవత్సరాలలో మన అవసరాలు ఏ విధంగా ఉంటాయో అనే ఆలోచనలను చేసి మరీ నూతన విద్యా విధానాన్ని తీసుకు రావడమైంది అని శ్రీ అమిత్ షా అన్నారు.  నూతన విద్యా విధానం మన విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేందుకు తగిన పరిస్థితులను కల్పిస్తుందిఅదే కాలంలో మన ప్రాచీన సంస్కృతితోనుమన భాషలతోను మనం అనుబంధాన్ని కలిగివుండేటట్లు కూడా చూస్తుంది అని ఆయన అన్నారు.

 

మధ్య ప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అభినందనలు తెలిపారు. నూతన విద్యా విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం అనే గౌరవాన్ని మధ్య ప్రదేశ్ దక్కించుకొందంటూ,   ఇంతకు ముందు కూడా ఇంజినీరింగ్వైద్య విజ్ఞానశాస్త్రాల పాఠ్య ప్రణాళికలను మన మాతృ భాష లోకి అనువదించేందుకు మధ్య ప్రదేశ్ చొరవ తీసుకొంది అని ఆయన అన్నారు.  దీనితో చాలా మంది పేద బాలలకు ఇంజినీరింగ్ నువైద్య విజ్ఞానశాస్త్రాన్ని వారి మాతృభాష లోనే చదువుకొనేందుకు అవకాశాన్ని కల్పించింది అని శ్రీ అమిత్ షా అన్నారు.

 

 

ప్రధాన మంత్రి శ్రేష్ఠ కళాశాలలను ప్రారంభించడమంటే పాత కళాశాలలకు వేరే పేరును పెట్టడం ఒక్కటే కాదు అని శ్రీ అమిత్ షా అన్నారు.  ప్రధాన మంత్రి శ్రేష్ఠ కళాశాలగా గుర్తింపును పొందే అర్హత ను పొందడం కోసం 486 కోట్ల రూపాయల నిధులతో ఆయా కళాశాలలను ఆధునీకరించివాటిని ప్రధాన మంత్రి శ్రేష్ఠ కళాశాలలుగా తీర్చిదిద్దడమైంది అని ఆయన వివరించారు.  ఈ కళాశాలల్లో విద్యను వేరు వేరు విభాగాలుగా బోధించడమంటూ జరగదు.  బిఎ చదవాలని ఒక విద్యార్థి కోరుకుంటే ఆ విద్యార్థికి విజ్ఞానశాస్త్రం నేర్చుకోవాలనే ఆసక్తి కూడా ఉన్నట్లయితేఅతడు లేదా ఆమె ఒకే కాలంలో ఆ సబ్జెక్టులో డిప్లొమా కోర్సును చదువ వచ్చు అని శ్రీ అమిత్ షా అన్నారు.  వాణిజ్యశాస్త్రాన్ని చదువుతున్న విద్యార్థికి కళలో గానిలేదా భాషలో గాని మక్కువ ఉన్నట్లయితేఈ సబ్జెక్టులను ఆ విద్యార్థి అదే కాలంలో చదువవచ్చు అంటూ హోం మంత్రి ఉదాహరణగా చెప్పారు.   వాణిజ్యశాస్త్ర విద్యార్థులలలో ఎవరికైనా సాంకేతిక విజ్ఞానంలో ఆసక్తి ఉందంటే గనక ఆ విద్యార్థి అతడికి/ఆమెకు ఉన్న ఆసక్తికి అనుగుణంగా ఒక డిప్లొమా కోర్సును కూడా చదువవచ్చు అని హోం మంత్రి అన్నారు.

 

నూతన విద్యా విధానాన్ని ఈ రోజున అమలులోకి తీసుకు రావడం ద్వారావిద్యా రంగంలో ఒక ముఖ్యమైన అధ్యాయానికి శుభారంభాన్ని మధ్య ప్రదేశ్ లిఖించింది అని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు.  విద్యకు ప్రయోజనం విద్యార్థిలో ఉండే అన్ని శక్తులను బయటకు తీసుకురావడంవారికి ఒక వేదికను ఇచ్చివారు ఎదగడానికి ఒక అవకాశాన్ని అందించడం అని ఆయన అన్నారు.  విషయాలనుపాఠ్య ప్రణాళికను జ్ఞాపకం పెట్టుకోవడం ద్వారా పరీక్షలో మార్పులను తెచ్చుకోవడం తేలికే.  కానీ మన లోలోపలి బలాలనుప్రతిభను సాన పెట్టుకొని సార్థక ఫలితాలను సాధించడం చాలా కష్టం అని శ్రీ అమిత్ షా అన్నారు.

 

 

 

ఈ రోజు ప్రారంభించిన 55 ‘ప్రధాన మంత్రి శ్రేష్ఠ కళాశాలలు’ విద్యార్థులకు ఉన్న ఆసక్తికి అనుగుణంగా బయో టెక్నాలజీకంప్యూటర్ సైన్స్సంస్కృతికళలు మొదలైన అనేక సబ్జెక్టులలో విద్యను అభ్యసించే అవకాశాన్ని అందించనున్నాయని శ్రీ అమిత్ షా అన్నారు. బి.ఇడిబి.ఎస్‌సి అగ్రికల్చర్ వంటి పాఠ్యక్రమాలను కూడా పరిచయం చేయడమైందన్నారు.  బి.ఎస్ సి అగ్రికల్చర్ వంటి పాఠ్యక్రమం వ్యవసాయంతో అనుబంధాన్ని పెంచుకొనే అవకాశాన్ని యువజనులను కల్పించిస్వతంత్రోపాధికి అనేక నూతన అవకాశాలను అందిస్తుందని ఆయన అన్నారు.  చాలా డిప్లొమా కోర్సులనుసర్టిఫికెట్ కోర్సులను ఐఐటి దిల్లీ తో పాటు అనేక ఇతర ప్రతిష్టాత్మక సంస్థలతో సంధానించే పని పూర్తి అయిందని ఆయన అన్నారు.  మధ్య ప్రదేశ్ హిందీ గ్రంథ్ అకాడమీకి చెందిన పుస్తకాల కేంద్రాన్ని కూడా 55 కళాశాలన్నింటిలోనూ ప్రారంభించారు.

 

 

 

ఇండోర్ ను ఇంతవరకు పత్తి తయారీ కేంద్రంగానుపరిశుభ్రత నిలయంగాను పరిగణిస్తూ రావడమైంది.  అయితేఇప్పుడు ఇండోర్ ఒక విద్యా కేంద్రంగా మారే మార్గంలో సైతం పయనిస్తోంది అని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు.   ఔషధ రంగంఆటోమొబైల్ రంగంవస్త్రాల రంగంఆహార శుద్ధి రంగాలలో ఇండోర్ ముందంజ వేస్తోందని ఆయన అన్నారు.

 

నూతన విద్యా విధానంలో భాగంగా మధ్య ప్రదేశ్ లో ఉన్నత విద్య బోధన కోసం అనేక కార్యక్రమాలను చేపట్టామని శ్రీ అమిత్ షా అన్నారు.  అనేక కొత్త కోర్సులను ప్రారంభించడం తో పాటు అనేక విశ్వవిద్యాలయాలను కూడా ఏర్పాటు చేయడమైంది అని మంత్రి అన్నారు.  యువత భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం నూతన విద్యా విధానాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రూపొందించారు అని శ్రీ అమిత్ షా అన్నారు.  నూతన విద్యా విధానంలో భాగంగా బాలలకు విద్యావిషయాలు ప్రధానంగా ఉండే పాఠ్య ప్రణాళికతో పాటు జీవితానికి సంబంధించిన పాఠ్యప్రణాళికను కూడా బోధిస్తారని ఆయన అన్నారు.  నూతన విద్యా విధానం లో రాశి కంటే వాసి పైన దృష్టిని కేంద్రీకరించడమైంది.  సాంప్రదాయ పద్ధతిలో ఆలోచనలు చేసే విధానాన్ని’ అలవరచడానికి బదులుగా సాంప్రదాయాలకు భిన్నమైన విధంగా కొత్త కొత్త ఆలోచనలను’ చేసే అలవాటును విద్యార్థులలో పాదుకొల్పడం కోసం నూతన విద్యా విధానంలో అనేక చర్యలను తీసుకోవడమైంది అని ఆయన వివరించారు.  యువతకు వృత్తి ప్రధానమైన నైపుణ్య ప్రధానమైన శిక్షణను అందించి విద్యా రంగానికిపరిశ్రమ రంగానికి మధ్య అంతరాన్ని భర్తీ చేయాలని కూడా నూతన విద్యావిధానం ప్రయత్నిస్తుందన్నారు.

 

 

నూతన విద్యా విధానం లో భాగం గా మన విద్యావ్యవస్థ 21వ శతాబ్దపు ప్రపంచ ప్రమాణాలకు సమానంగా నిలువనుంది అని కేంద్ర హోం ,  సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు.  పుస్తకాలలో ఉన్న విషయాలను గుర్తు పెట్టుకోవడం కంటే ఆలోచనలను ఆవిష్కరించడానికి నూతన విద్యావిధానం ప్రాధాన్యాన్ని ఇస్తుంది అని కూడా ఆయన అన్నారు. విద్యార్థులకు డిగ్రీలను ఇవ్వడం ఒక్కటే కాకుండావారిలో మేధస్సు సంపూర్ణంగా వికసించే అంశానికి నూతన విద్యావిధానం పెద్ద పీట వేస్తుంది అని కూడా ఆయన అన్నారు.  యువజనులు వారికంటూ లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వడాన్ని నేర్చుకోవాలి అని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా యువతకు విజ్ఞప్తి చేశారు.  ఏ లక్ష్యం లేని జీవితం కాలాన్ని వృథా చేసేస్తుందిలక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో విఫలం కావడం అంటే అది కాలాన్నంతటినీ వ్యర్థ పరచడం లాంటిదే అని ఆయన అన్నారు.  కఠోర శ్రమకు ప్రత్యామ్నాయం ఏదీ లేదు.  మన దేశ యువత వారికంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొనిఆ లక్ష్యాన్ని సాధించడం కోసం కఠోరంగా శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన ఉద్బోధించారు.  కఠోర శ్రమతో సాఫల్యానికి అవసరమైన పునాది ని సిద్ధం చేసుకొనేవారి పైనే విధి తన అనుగ్రహాన్ని కురిపిస్తుంది అని ఆయన అన్నారు. విద్యార్థులు నేటి నుంచే వారి జీవిత లక్ష్యాలను ఖరారు చేసుకొనివాటిని సాధించుకోవడానికి తీవ్రంగా కృషి చేయాలి అని శ్రీ అమిత్ షా విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

 

 

ఈ తరం ఇంటర్ నెట్కృత్రిమ మేధ(ఎఐ)డేటా ఎనలిటిక్స్ లను వినియోగిస్తున్న తరంఈ కారణంగా నూతన విద్యా విధానంలో ప్రాక్టికల్స్నైపుణ్యాభివృద్ధివృత్తి ప్రధాన శిక్షణ వంటి అంశాలను చేర్చడమైంది అని కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు.  2047లోభారతదేశం ప్రపంచంలో తప్పక అగ్రస్థానాన నిలుస్తుంది అని ఆయన అన్నారు.  మనకు స్వాతంత్య్రః శతాబ్ది కాలానికి గాను మనకు ఒక లక్ష్యాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించారని శ్రీ అమిత్ షా అన్నారు.

 

 

 

 

ఈ లక్ష్యం ఇక్కడ ఉన్న  బాలబాలికలదీ, యువజనులదీనూ; రేపటి పౌరులు మీరే అని విద్యార్థులతో శ్రీ అమిత్ షా అన్నారు.  యావత్తు ప్రపంచంలో ప్రతి రంగంలో భారతదేశం గొప్పదిగా ఉండే రోజును యువత చూస్తుంది; మన నూతన విద్యా విధానం, నేటి ఈ ప్రధాన మంత్రి శ్రేష్ఠ కళాశాల ఈ లక్ష్యానికి పునాదిని వేస్తుంది అని మంత్రి అన్నారు. 

 

 

***



(Release ID: 2033539) Visitor Counter : 24