ప్రధాన మంత్రి కార్యాలయం
నోబెల్ పురస్కార గ్రహీత ఆంటోన్ శైలింగర్‌తో ప్రధాని సంభాషణ
प्रविष्टि तिथि:
10 JUL 2024 9:48PM by PIB Hyderabad
ఆస్ట్రియాలోని ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత శ్రీ ఆంటోన్ శైలింగర్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొద్దిసేపు సంభాషించారు. క్వాంటం మెకానిక్స్‌పై విశేష పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తగా జగత్ప్రసిద్ధుడైన ఆయన, 2022లో భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి పొందారు.
ఈ సంభాషణల్లో భాగంగా భారత జాతీయ క్వాంటం మిషన్‌పై తన ఆలోచనలను ప్రధానమంత్రి ఆయనతో పంచుకున్నారు. అలాగే సమకాలీన సమాజంపై క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం సాంకేతికత పాత్ర, భవిష్యత్తు దిశగాగల అవకాశాలపై పరస్పర అభిప్రాయ మార్పిడి చేసుకున్నారు.
***
(रिलीज़ आईडी: 2032319)
आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam