సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేవీఐసీ సరికొత్త రికార్డు


తొలిసారి రూ.1.5 లక్షల కోట్లు దాటిన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల టర్నోవర్

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక గణాంకాలను విడుదల చేసిన కేవీఐసీ


గత పదేళ్లలో ఉత్పత్తిలో 315% పెరుగుదల, అమ్మకాలలో 400% పెరుగుదల


గత పదేళ్లలో చరిత్రాత్మకంగా 81% పెరిగిన నూతన ఉపాధి కల్పన


పదేళ్లలో ఖాదీ గ్రామోద్యోగ్ భవన్ వ్యాపారం రికార్డు స్థాయిలో 87.23% వృద్ధి

Posted On: 09 JUL 2024 6:27PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తిఅమ్మకాలుఉపాధి కల్పనలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

 

కేవీఐసీ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక గణాంకాలను విడుదల చేశారు. పాత రికార్డులన్నింటినీ తిరగరాస్తూఉత్పత్తుల అమ్మకాల్లో 399.69 శాతం (దాదాపు 400%), ఉత్పత్తిలో 314.79 శాతం (దాదాపు 315%), కొత్త ఉపాధి కల్పనలో 80.96 శాతం (దాదాపు 81%) పెరుగుదల నమోదైందని ఆయన తెలిపారు. 2013-14తో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 332.14 శాతంఉత్పత్తిలో 267.52 శాతంనూతన ఉపాధి కల్పనలో 69.75 శాతం వృద్ధి నమోదైందని గణాంకాలను వెల్లడించారు.

 

 

2047 నాటికి 'అభివృద్ధి చెందిన భారతదేశంఅనే స్వప్నాన్ని సాకారం చేసేందుకుభారత్ ను ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి కెవిఐసి అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తూగణనీయమైన సహకారాన్ని అందించిందని శ్రీ కుమార్ అన్నారు. కేవీఐసీ స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తుల అమ్మకాలు రూ.1.55 లక్షల కోట్లు దాటాయని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు రూ.1.34 లక్షల కోట్లుగా ఉన్నాయి. మోదీ ప్రభుత్వ హయాంలో గత పదేళ్లలో గ్రామీణ చేతివృత్తుల వారు తయారు చేసిన స్వదేశీ ఖాదీగ్రామీణ పరిశ్రమ ఉత్పత్తుల అమ్మకాలు పరిశీలిస్తే, 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.31,154.20 కోట్లు కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.1,55,673.12 కోట్లకు పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలోకెవిఐసి గ్రామీణ ప్రాంతాల్లో 10.17 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించిగ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది.

 

ఈ చారిత్రాత్మక విజయానికి గాంధీజీ స్ఫూర్తిప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హామీదేశంలోని మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్న కోట్లాది మంది కళాకారుల అవిశ్రాంత కృషే కారణమని కేవీఐసీ చైర్మన్ పేర్కొన్నారు. ఖాదీ ఉత్పత్తులు ప్రతి ఒక్కరు వినియోగించేలా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బలపరచడం ద్వారా  ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని ఆయన అన్నారు. ఖాదీ యువతకు ఫ్యాషన్‌లో 'కొత్త స్టేటస్ సింబల్'గా మారిందన్నారు. ఖాదీగ్రామీణ పరిశ్రమ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ వేగంగా పెరుగుతోందిఇది ఉత్పత్తిఅమ్మకాలుఉపాధి గణాంకాలలో ప్రతిబింబిస్తోంది. గత పదేళ్లలో ఖాదీగ్రామీణ పరిశ్రమల ఉత్పత్తిని పెంచేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో గణనీయమైన మార్పులునిర్ణయాలు తీసుకున్నామనిఇవి సానుకూల ఫలితాలను ఇస్తున్నాయని ఆయన అన్నారు. మేకిన్ ఇండియావోకల్ ఫర్ లోకల్స్వదేశీ ఉత్పత్తులపై దేశ ప్రజలకు నమ్మకం పెరిగిందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమన్నారు.

 

2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.26,109.08 కోట్లుగా ఉన్న ఖాదీగ్రామీణ పరిశ్రమ ఉత్పత్తుల ఉత్పత్తి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 314.79 శాతం పెరిగి రూ.108,297.68 కోట్లకు చేరుకుంది. నిరంతరం పెరుగుతున్న ఉత్పత్తి ఖాదీగ్రామీణ పరిశ్రమల కమిషన్ గ్రామీణ ప్రాంతాలలో చారిత్రాత్మక కృషి చేసిందని తెలిపేందుకు బలమైన సాక్ష్యమని ఆయన అన్నారు.

 

గత 10 ఆర్థిక సంవత్సరాల్లోఖాదీగ్రామీణ పరిశ్రమ ఉత్పత్తులు ప్రతి ఏడాది అమ్మకాలలో రికార్డులను నెలకొల్పాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు రూ.31,154.20 కోట్లు కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి అవి రూ.1,55,673.12 కోట్లకు చేరుకున్నాయి.

 

గత పదేళ్లలో ఖాదీ వస్త్రాల ఉత్పత్తి అనూహ్యంగా పెరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఖాదీ వస్త్రాల ఉత్పత్తి రూ.811.08 కోట్లు కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 295.28 శాతం పెరుగుదలతో రూ.3,206 కోట్లకు చేరుకుని అత్యుత్తమ రికార్డును నెలకొల్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఖాదీ వస్త్రాల ఉత్పత్తి రూ.2915.83 కోట్లుగా ఉంది.

 

గత పది ఆర్థిక సంవత్సరాల్లో ఖాదీ వస్త్రాలకు డిమాండ్ కూడా వేగంగా పెరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో దీని అమ్మకాలు కేవలం రూ.1,081.04 కోట్లు కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 500.90 శాతం పెరుగుదలతో రూ.6,496 కోట్లకు చేరుకున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.5,942.93 కోట్ల విలువైన ఖాదీ వస్త్రాలను విక్రయించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ మాధ్యమాలుపెద్ద సమావేశాలలో ఖాదీని ప్రోత్సహించడం ద్వారాఖాదీ వస్త్రాల అమ్మకాలపై విస్తృత ప్రభావం చూపింది. గత ఏడాది దేశంలో జరిగిన జీ-20 సదస్సులో ప్రధాని ఖాదీని ప్రోత్సహించిన తీరు ప్రపంచ సమాజాన్ని ఖాదీ వైపు ఆకర్షించింది.

 

ఖాదీగ్రామీణ పరిశ్రమల కమిషన్ ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించడం. గత పదేళ్లలో కేవీఐసీ కూడా ఈ రంగంలో రికార్డు సృష్టించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉపాధి 1.30 కోట్లు కాగా, 2023-24 నాటికి 43.65 శాతం పెరుగుదలతో 1.87 కోట్లకు చేరుకుంది. అదేవిధంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో 5.62 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 80.96 శాతం పెరుగుదలతో 10.17 లక్షలకు చేరుకున్నాయి. ఖాదీ వస్త్రాల తయారీలో 4.98 లక్షల మంది గ్రామీణ ఖాదీ కళాకారులు (స్పిన్నర్లునేత కార్మికులు) పనిచేస్తున్నారు.

 

దిల్లీలోని ఖాదీగ్రామోద్యోగ్ భవన్ వ్యాపారం కూడా గత పదేళ్లలో అనూహ్యమైన వృద్ధిని సాధించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ వ్యాపారం రూ.51.13 కోట్లు కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో అది 87.23 శాతం పెరిగి రూ.95.74 కోట్లకు చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో న్యూఢిల్లీలోని ఖాదీ గ్రామోద్యోగ్ భవన్ వ్యాపారం రూ.83.13 కోట్లుగా ఉంది.

***


(Release ID: 2032278) Visitor Counter : 201