రాష్ట్రప‌తి స‌చివాల‌యం

డూరండ్ కప్ ఆటల పోటీ ట్రోఫీలను ఆవిష్కరించిన భారత రాష్ట్రపతి

Posted On: 10 JUL 2024 1:54PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము డూరండ్ కప్ టోర్నమెంట్ 2024 కు సంబంధించిన ట్రోఫీలను రాష్ట్రపతి భవన్సాంస్కృతిక కేంద్రంలో ఈ రోజున (అంటే 2024 జులై 10వ తేదీన) జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా డూరండ్ కప్ నుప్రెసిడెంట్స్ కప్ నుసిమ్లా ట్రోఫీ ని ఆవిష్కరించారు.

రాష్ట్రపతి ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూప్రపంచంలో ప్రజాదరణ అమితం గా ఉన్న  క్రీడలలో ఫుట్ బాల్ ఒకటి అన్నారు.  వృత్తి నైపుణ్యం కలిగిన ఫుట్ బాల్ క్రీడాకారులు వేల కొద్దీ అభిమానుల సమక్షంలో ఆడుతూ ఉన్నప్పుడు ఇటు ప్రేక్షకులలోను, అటు ఆటగాళ్ళలోను ఉత్తేజం అనేక రెట్లు పెరిగిపోతుందని రాష్ట్రపతి అన్నారు.

డూరండ్ కప్ టోర్నమెంట్ 2024 లో పాలుపంచుకొనే క్రీడాకారులందరికీ రాష్ట్రపతి శుభాకాంక్షలను తెలియజేశారు.  ఆటగాళ్ళు వారు గెలిచినా, లేదా ఓడినా క్రీడలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని,  ఇతర జట్లను క్రీడాకారులు గౌరవించాలని రాష్ట్రపతి అన్నారు.  ఆటలో కొన్ని సందర్బాల లో ఆవేశంఉద్వేగం తలెత్తుతాయి,  అయితే ఆటగాళ్ళు వారి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించాలని,  ఆటలో వారి అత్యున్నత ప్రతిభ ను కనబరచడానికి ప్రయత్నించాలని ఆమె అన్నారు.  ఆటగాళ్ళు అందరు దృఢ సంకల్పంతోక్రీడా స్ఫూర్తిని చాటుతారన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.

భారతదేశంలో ఫుట్ బాల్ స్థాయిని పెంచేందుకు కృషి చేయాలని ఫుట్ బాల్ క్రీడా ప్రేమికులందరికీ రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు.

  

***



(Release ID: 2032275) Visitor Counter : 41