ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్వరలో ఆస్ట్రియా ను సందర్శించనుండగా, ఆ యాత్ర ను స్వాగతించిన ఆస్ట్రియా చాన్స్ లర్; కృత జ్ఞతను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
07 JUL 2024 8:57AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్వరలోనే ఆస్ట్రియా కు ఆధికారిక సందర్శన కు బయలుదేరనుండగా ఈ విషయం లో ఆస్ట్రియా చాన్స్ లర్ శ్రీ కార్ల్ నెహమర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు గాను ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ ప్రధాన మంత్రి ఒకరు ఆస్ట్రియా ను సందర్శించనుండడం నలభై సంవత్సరాలలో ఇదే తొలిసారి. ‘‘ఈ సందర్శన ఒక విశేషమైన గౌరవం. ఎందుకంటే గత నలభై సంవత్సరాలలో భారతదేశ ప్రధాన మంత్రి ఒకరు ఆస్ట్రియా కు జరపనున్న మొట్టమొదటి యాత్ర ఇది; అంతేకాదు, ఇది ఒక ప్రముఖమైన మైలురాయి కూడా. భారతదేశం తో మా దౌత్య సంబంధాల కు 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నందుకు గుర్తుగా మనం కలసి ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం కూడా.’’ అని ఆస్ట్రియా చాన్స్ లర్ అన్నారు.
శ్రీ నరేంద్ర మోదీ తన సమాధానం లో, ఈ చరిత్రాత్మకమైన సందర్భం లో సంబంధాలను బలపరచుకోవడంతో పాటు సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడం కోసం జరిపే చర్చల విషయం లో తాను ఆశాభావంతో ఉన్నానన్నారు.
చాన్స్ లర్ శ్రీ కార్ల్ నెహమర్ ఎక్స్ లో పొందుపరచిన ఒక సందేశానికి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందిస్తూ:
‘‘చాన్స్ లర్ శ్రీ @karlnehammer , మీకు ఇవే ధన్యవాదాలు. ఈ చరిత్రాత్మకమైన సందర్భానికి గుర్తు గా ఆస్ట్రియా ను సందర్శించనుండడం నిజానికి ఒక గౌరవాన్వితమైన విషయం అని చెప్పాలి. రెండు దేశాల మధ్య సంబంధాలను బలపరచుకోవడం తో పాటు ద్వైపాక్షిక సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడం కోసం జరగనున్న చర్చలలో
పాలుపంచుకోవడానికి నేను ఎదురుచూస్తున్నాను. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్ట నియమాలతో కూడిన ఉమ్మడి విలువలు అనే పునాది మీద ఎల్లప్పటికీ సన్నిహితంగా ఉండేటటువంటి భాగస్వామ్యాన్ని మనం మరింత పటిష్టంగా నిర్మించుకొందాం.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2031444)
Visitor Counter : 74
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam