బొగ్గు మంత్రిత్వ శాఖ
గత సంవత్సరం తో పోలిస్తే 2024 జూన్ లో బొగ్గుఉత్పత్తి లో విశేష వృద్ధి
Posted On:
02 JUL 2024 4:05PM by PIB Hyderabad
భారతదేశం లో బొగ్గు ఉత్పత్తి 2024 జూన్ లో 84.63 మెట్రిక్ టన్నుల కు (ఎమ్ టి) (తాత్కాలికం) చేరుకొంది. మునుపటి సంవత్సరం లో ఇదే కాలం లో 73.92 మెట్రిక్ టన్నులు గా ఉన్న బొగ్గు ఉత్పత్తి స్థాయి తో పోలిస్తే ఇది 14.49 శాతం వృద్ధి కి సమానం. 2024 జూన్ లో, కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) 63.10 ఎమ్ టి ల (తాత్కాలికం) మేరకు బొగ్గు ఉత్పత్తిని సాధించింది; గత సంవత్సరం 57.96 ఎమ్ టి గా ఉన్న బొగ్గు ఉత్పత్తి తో పోలిస్తే 8.87 శాతం వృద్ధి ని ఇది సూచిస్తున్నది. దీనికి అదనంగా, కేప్టివ్/ ఇతర సంస్థల బొగ్గు ఉత్పాదన 2024 జూన్ లో 16.03 ఎమ్ టి (తాత్కాలికం) స్థాయి లో ఉంది. ఇది పూర్వపు సంవత్సరం ఇదే కాలం లోని 10.31 ఎమ్ టి లతో పోల్చి చూసినప్పుడు 55.49 శాతం వృద్ధి ని ప్రతిబింబిస్తున్నది.
భారతదేశం యొక్క బొగ్గు రవాణా 2024 జూన్ నెల లో 85.76 ఎమ్ టి (తాత్కాలికం) స్థాయి కి చేరుకొంది; క్రితం సంవత్సరం ఇదే కాలం లో నమోదు అయిన బొగ్గు రవాణా 77.86 ఎమ్ టి గా ఉండగా, ప్రస్తుతం పెరుగుదల 10.15 శాతం ఉందన్న మాట. సిఐఎల్ 2024 జూన్ లో 64.10 ఎమ్ టి (తాత్కాలికం) బొగ్గు ను రవాణా చేసింది. ఇది మునుపటి సంవత్సరం జూన్ మాసం లో ఈ సంస్థ రవాణా చేసిన 60.81 ఎమ్ టి తో పోల్చి చూసినప్పుడు 5.41 శాతం వృద్ధి తాజా గా చోటు చేసుకొంది. దీనికి అదనంగా కేప్టివ్ /ఇతర సంస్థల డిస్‌పాచ్ లు జూన్ లో 16.26 ఎమ్ టి (తాత్కాలికం) గా నమోదు అయి, పూర్వపు సంవత్సరం లోని 11.30 ఎమ్ టి స్థాయి కంటే 43.84 శాతం అధికం గా ఉంది.
దీనికి అదనం గా, బొగ్గు వ్యాపార సంస్థల వద్ద ఉన్న నిలవలు 2024 జూన్ నెలాఖరు నాటికి గమనించదగినంత గా పెరిగి 95.02 ఎమ్ టి కి (తాత్కాలికం) చేరాయి. ఈ పరిణామం బొగ్గు రంగం లో పటిష్టమైన పనితీరు ను మరియు ప్రభావశీలత్వాన్ని చాటిచెప్తూ, ఆకర్షణీయమైనటువంటి 41.68 శాతం వార్షిక వృద్ధి రేటు ను సూచించింది. అదే కాలం లో, థర్మల్ పవర్ ప్లాంట్స్ (టిపిపి) దగ్గర ఉన్న బొగ్గు రాశి కూడా గణనీయం గా వృద్ధి చెంది దీనిలో 30.15 శాతం వార్షిక వృద్ధి రేటు తో 46.70 ఎమ్ టి (తాత్కాలికం) గా ఉంది.
ప్రధాన మంత్రి యొక్క ‘‘ఆత్మ నిర్భర్ భారత్‘’ దృష్టికోణాని కి అనుగుణం గా, శక్తి రంగం లో సుస్థిర అభివృద్ధి మరియు స్వయం సమృద్ధి ల సాధన దిశ లో బొగ్గు మంత్రిత్వ శాఖ సాగిస్తున్నటువంటి యాత్ర కు చోదకం గా అలుపెరుగని ప్రయాసల ను మరియు వ్యూహాత్మక కార్యక్రమాల ను చేపడుతున్నది.
***
(Release ID: 2030268)
Visitor Counter : 122