ప్రధాన మంత్రి కార్యాలయం
టిఎన్ఎ సీనియర్ నేత శ్రీ ఆర్. సంపదన్ మృతి కిసంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
01 JUL 2024 1:00PM by PIB Hyderabad
టిఎన్ఎ కు చెందిన చిరకాలానుభవం కలిగిన నేత శ్రీ ఆర్. సంపదన్ మృతి కి ప్రగాఢ సంతాపాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
శ్రీ ఆర్. సంపదన్ శ్రీ లంక లో తమిళ జాతీయుల కు శాంతి, సురక్ష, సమానత్వం, న్యాయం మరియు గౌరవం లతో నిండిన జీవనం దక్కడం కోసం అదే పనిగా పాటుపడ్డారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో పొందుపరచిన ఒక సందేశం లో -
‘‘టిఎన్ఎ కు చెందిన చిరకాలానుభవం కలిగిన నేత శ్రీ ఆర్. సంపదన్ యొక్క కుటుంబాని కి మరియు స్నేహితుల కు ఇదే నా ప్రగాఢ సంతాపం. ఆయన తో నేను జరిపిన సమావేశాల తాలూకు ఆప్యాయత భరిత జ్ఞాపకాల ను నా మనస్సు లో ఎప్పటికీ పదిల పరచుకొంటాను. ఆయన శ్రీ లంక లో ఉంటున్న తమిళ జాతీయుల కు శాంతి, సురక్ష, సమానత్వం, న్యాయం మరియు గౌరవం ల కోసం అలుపెరుగక కృషి చేశారు. శ్రీ లంక లో మరియు భారతదేశం లో ఆయన మిత్రులు, మరి ఆయన అనుచరులు ఆయన ను ఎప్పటికీ గుర్తుపెట్టుకొంటారు.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2030038)
आगंतुक पटल : 101
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam