యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఎన్ఐఎస్ పాటియాలాను సందర్శించిన కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి; పారిస్ ఒలింపిక్స్ అథ్లెట్లకు ప్రోత్సాహం


2024 పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు తయారుకావడంలో మన అథ్లెట్లకు అందవలసినంత ఉత్తమ మద్దతు లభిస్తోంది : డాక్టర్ మాండవీయ

Posted On: 29 JUN 2024 5:59PM by PIB Hyderabad

ఒలింపిక్స్ కు వెళ్తున్న అథ్లెట్లు వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను, జావెలిన్ త్రోయర్ అనరాణి, షాట్ పుటర్ అభా ఖతువాలను కలిసేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు; కార్మిక, ఉపాధికల్పన శాఖల మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ నేడు పాటియాలాలో నేతాజీ సుభాశ్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ను సందర్శించారు. అక్కడ నిర్మాణంలో ఉన్న నూతన మౌలిక వసతుల పురోగతిని కూడా ఆయన పరిశీలించారు.

‘‘మీరాబాయి, అనూ రాణి, అభాలతో నా సంభాషణను బట్టి 2024 పారిస్ ఒలింపిక్స్ కు సిద్ధం అయ్యే విషయంలో వారికి అత్యుత్తమ మద్దతు లభిస్తున్నట్టు నాకు అర్ధమయింది’’ అని డాక్టర్ మాండవీయ చెప్పారు.

యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నుంచి తనకు అద్బుతమైన మద్దతు లభిస్తోందని, ప్రత్యేకించి ప్రపంచ ప్రఖ్యాత క్రీడా శాస్ర్తవేత్త, అమెరికాలోని సెయింట్ లూయీస్ కి చెందిన డాక్టర్ ఆరాన్ హోర్షింగ్ సేవలు అందుకోగలిగానని మీరాబాయి చాను చెప్పారు. యూరప్ బేస్ ల నుంచి తనకు విస్తృత సమయం శిక్షణ లభించిందని అనూరాణి తెలిపారు.

స్థానిక నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో నమోదైన ఇతర అథ్లెట్లు, ప్రముఖ కోచ్ లతో కూడా డాక్టర్ మాండవీయ సంభాషించారు. పోటీతో కూడిన క్రీడల నుంచి డ్రాపౌట్లను తగ్గించేందుకు సలహాలు ఇవ్వాలని ఆయన వారిని కోరారు. ‘‘మీరు అవసరమైన మద్దతు పొందుతున్నారు. కాని మీతో పాటుగానే కెరీర్ ప్రారంభించిన పలువురు ఎలాంటి పతకాలు గెలుచుకోకుండా వెనుకబడిపోయి ఉన్నారు. వారి కోసం మనం ఏం చేయాలి’’ అని ఆయన ప్రశ్నించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  క్రీడారంగం సర్వతోముఖాభివృద్ధి విజన్ కు అనుగుణంగా ప్రభుత్వం అట్టడుగు స్థాయి నుంచి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు. 

కేంద్ర మంత్రి ఎన్ఎస్ఎన్ఐఎస్ సమీక్ష కూడా చేపట్టడంతో పాటు పలు క్రీడా మైదానాలు, క్రీడా వసతులు, కొత్త మౌలిక వసతుల ప్రాజెక్టు ప్రదేశాలను సందర్శించారు. హై పెర్ఫార్మెన్స్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్, కిచెన్, డైనింగ్ ప్రదేశాల నిర్మాణంలో పురోగతి పట్ల ఆయన ఆనందం ప్రకటించారు.

‘‘భారత క్రీడలకు సాంప్రదాయిక కేంద్రం అయిన ఎన్ఐఎస్ నుం సందర్శించడం నాకు ఆనందంగా ఉంది. గ్రామీణ స్థాయిలో మార్పును తీసుకురాగల కోచ్ ల తయారీ కేంద్రం మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన శిక్షణా కేంద్రం. ప్రపంచంలోని ఇతర కేంద్రాల్లో శిక్షణ పొందిన అథ్లెట్లు కూడా ఎన్ఐఎస్ ను ప్రపంచంలోని ఉత్తమ శిక్షణ కేంద్రాలతో సరిపోల్చవచ్చునంటున్నారు’’ అని డాక్టర్ మాండవీయ చెప్పారు.

తదుపరి తావు దేవి లాల్ స్టేడియంలో నేషనల్ ఇంటర్-స్టేట్ అథ్లెట్ చాంపియన్ షిప్స్ లో  అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన లోగోను ఆవిష్కరించడానికి  కేంద్ర మంత్రి పంచకుల వెళ్లారు.  

 

***



(Release ID: 2029626) Visitor Counter : 7