గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ

జూన్‌ 29, 2024న ‘గణాంకాల దినోత్సవం’ ఇతివృత్తం: నిర్ణయం తీసుకోవడం కోసం డేటాను ఉపయోగించడం

Posted On: 28 JUN 2024 11:24AM by PIB Hyderabad

గణాంకాలుఆర్థిక ప్రణాళికా రంగాలలో  దివంగత  ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహాలనోబిస్ చేసిన విశేష కృషికి గుర్తింపుగాఆయన జన్మదినమైన జూన్‌ 29ను "గణాంకాల దినోత్సవం"(స్టాటిస్టిక్స్‌ డే)గా జాతీయ స్థాయిలో జరుపుకోవాల్సిన రోజుల ప్రత్యేక విభాగంలో నిర్వహించాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. సాంఘిక-ఆర్థిక ప్రణాళిక, దేశ అభివృద్ధికి విధాన రూపకల్పనలో గణాంకాల పాత్ర, ప్రాముఖ్యతపై ప్రజల్లో, ముఖ్యంగా యువతరంలో అవగాహన కల్పించడం గణాంకాల దినోత్స ప్రధాన లక్ష్యం.

2007 నుండి, సమకాలీన జాతీయ ప్రాధాన్య ఇతివృత్తంతో ప్రతి ఏడాది గణాంకాల దినోత్సవం జరుపుకుంటున్నారు2024 గణాంకాల దినోత్సవం ఇతివృత్తం "నిర్ణయం తీసుకోవడం కోసం డేటాను ఉపయోగించడం". డేటా ఆధారిత నిర్ణయాలు అనే భావన ఏదైనా రంగంలో నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్యమైనదిఅధికారిక గణాంకాల నుండి వెలువడే గణాంక సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి, సాక్ష్యం-ఆధారిత నిర్ణయం తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.

2024 గణాంక దినోత్సవ ప్రధాన కార్యక్రమం న్యూఢిల్లీలోనిఢిల్లీ కంటోన్మెంట్లో ఉన్న మానెక్‌షా సెంటర్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా హాజరవుతున్నారుజాతీయ గణాంకాల కమిషన్‌ (NSC) చైర్మన్ ప్రొఫెసర్ రాజీవ లక్ష్మణ్ కరాండికర్, గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేవారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతేకాకుండా, కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ ఉన్నతాధికారులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు. ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు, ఇతర వాటాదారులు ఇందులో పాల్గొంటారు. ఈ కార్యక్రమం మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెబ్-కాస్ట్/ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

ఈ కార్యక్రమంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నిర్వహించే ‘ఆన్ ది స్పాట్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, 2024’ విజేతలను సన్మానిస్తారు.

ఈ కార్యక్రమంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు - నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్‌వర్క్ అభివృద్ధి నివేదిక, 2024ను విడుదల చేయనున్నారు. ఈ నివేదికతో పాటుసుస్థిర అభివృద్ధి లక్ష్యాలు జాతీయ ఇండికేటర్ ఫ్రేమ్‌వర్క్, 2024 పై డేటా స్నాప్‌షాట్ కూడా విడుదల చేస్తారు.

వినియోగదారులకు అధికారిక గణాంకాలను సమర్థవంతంగా అందించాల్సిన అవసరాన్ని గుర్తించిగణాంకాలుకార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కోసం ముఖ్యమైన స్థూల సూచికల సమాచారం, మంత్రిత్వ శాఖకు చెందిన డేటా వివరాలతో కూడిన ఈసాంఖ్యకి (eSankhyiki) అనే డేటా పోర్టల్‌ను అభివృద్ధి చేస్తోంది.  eSankhyiki పోర్టల్తో పాటు సెంట్రల్ డేటా రిపోజిటరీని ఈ కార్యక్రమంలో ప్రారంభించనున్నారు.

కార్యక్రమంలో భాగంగా జరిగే సాంకేతిక సమావేశాల్లో నిపుణులు/వక్తలు ఇతివృత్తంపై సంక్షిప్త ప్రదర్శనలు/ప్రసంగాలు చేస్తారు.

*** 



(Release ID: 2029424) Visitor Counter : 645