ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ నాదప్రభు కెంపెగౌడ కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
27 JUN 2024 3:24PM by PIB Hyderabad
శ్రీ నాదప్రభు కెంపెగౌడ కు ఆయన జయంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు. ఆర్థిక అభ్యున్నతి వ్యవసాయం, సేద్యపు నీటిపారుదల మరియు అనేక ఇతర రంగాల లో వృద్ధి కి దోహదం చేసే విధానాల లో శ్రీ నాదప్రభు కెంపెగౌడ ఒక మార్గదర్శి గా నడుచుకొన్నారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో -
‘‘శ్రీ నాదప్రభు కెంపెగౌడ కు ఆయన జయంతి నాడు ఇదే శ్రద్ధాంజలి. ఆయన కు ఉన్న దూరదృష్టి మరియు పరిపాలన సంబంధి నైపుణ్యాల పరం గా ఆయన దార్శనికుని గా పేరు గాంచారు. ఆర్థిక అభ్యున్నతి, వ్యవసాయం, సాగునీరు, ఇంకా అనేక ఇతర రంగాల లో వృద్ధి కి దోహదం చేసే విషయాల లో ఆయన మార్గదర్శి గా వ్యవహరించారు. ఆయన తీర్చిదిద్దిన నగరం బెంగళూరు, ఆ నగరం గతిశీలతకు, చైతన్యాని కి మరియు నూతన ఆవిష్కరణ లకు గాను ప్రపంచ స్థాయి లో ప్రశంసల కు నోచుకొంది. సమాజం పట్ల ఆయన దృష్టికోణాన్ని సాకారం చేయడం కోసం మరియు ఆయన ఆయన యొక్క హృదయాని కి దగ్గరగా అట్టిపెట్టుకొన్నటువంటి విలువల ను కాపాడడం కోసం మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటుంది. 2022 వ సంవత్సరం లో ‘స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పెరిటి’ ని ఆవిష్కరించే గౌరవం నాకు దక్కింది; ఆ విగ్రహం తాలూకు కొన్ని చిత్రాల ను పంచుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
“ಶ್ರೀ ನಾಡಪ್ರಭು ಕೆಂಪೇಗೌಡರ ಜಯಂತಿಯಂದು ಅವರಿಗೆ ಗೌರವ ನಮನಗಳು. ಅವರು ದೂರದೃಷ್ಟಿ ಮತ್ತು ಆಡಳಿತಾತ್ಮಕ ಕೌಶಲ್ಯಗಳಿಗೆ ಹೆಸರುವಾಸಿಯಾದ ದಾರ್ಶನಿಕರಾಗಿದ್ದರು. ಆರ್ಥಿಕ ಹಿತಚಿಂತನೆ, ಕೃಷಿ, ನೀರಾವರಿ ಮುಂತಾದವುಗಳ ಸುಧಾರಣೆಯಲ್ಲಿ ಅವರು ಮುಂಚೂಣಿಯಲ್ಲಿದ್ದರು. ಅವರು ಕಟ್ಟಿದ ಬೆಂಗಳೂರು ನಗರ ತನ್ನ ಚಲನಶೀಲತೆ, ಹುರುಪು ಮತ್ತು ನಾವೀನ್ಯತೆಗಾಗಿ ಜಾಗತಿಕವಾಗಿ ಮೆಚ್ಚುಗೆ ಪಡೆದಿದೆ. ಸಮಾಜದ ಬಗ್ಗೆ ಕೆಂಪೇಗೌಡರ ದೂರದೃಷ್ಟಿಯನ್ನು ನನಸಾಗಿಸಲು ಮತ್ತು ಅವರು ಪೋಷಿಸಿದ ಮೌಲ್ಯಗಳನ್ನು ಎತ್ತಿಹಿಡಿಯಲು ನಮ್ಮ ಸರ್ಕಾರ ಕೆಲಸ ಮಾಡುತ್ತಲೇ ಇರುತ್ತದೆ. 2022ರಲ್ಲಿ ನನಗೆ ಉದ್ಘಾಟನೆ ಭಾಗ್ಯ ದೊರೆತ 'ಸಮೃದ್ಧಿ ಪ್ರತಿಮೆ'ಯ ಚಿತ್ರಗಳನ್ನು ಇಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇನೆ.”
***
DS/ST
(रिलीज़ आईडी: 2029235)
आगंतुक पटल : 103
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam