కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టెలికం సేవల కోసం ఉద్దేశించిన స్పెక్ట్రమ్ యొక్కవేలాన్ని ఈ రోజు న ఉదయం పూట 10 గంటల కు మొదలు పెట్టనున్న ప్రభుత్వం
రిజర్వు ధరల వద్ద 96,238.45 కోట్ల రూపాయల విలువైన వేరు వేరు బ్యాండుల లోని మొత్తం10,522.35 ఎమ్‌హెచ్‌జడ్స్పెక్ట్రమ్ ను వేలం వేయడం జరుగుతున్నది
బిడ్ లను సమర్పించడానికి సిద్ధం చేసిన స్పెక్ట్రమ్ బ్యాండులలో - 800 ఎమ్‌హెచ్‌జడ్, 900 ఎమ్‌హెచ్‌జడ్, 1800 ఎమ్‌హెచ్‌జడ్, 2100 ఎమ్‌హెచ్‌జడ్, 2300 ఎమ్‌హెచ్‌జడ్, 2500 ఎమ్‌హెచ్‌జడ్, 3300ఎమ్‌హెచ్‌జడ్ మరియు 26 జిహెచ్‌జడ్ లు ఉన్నాయి
Posted On:
25 JUN 2024 8:46AM by PIB Hyderabad
ప్రస్తుత టెలికం సేవల ను పెంచడం తో పాటు ఆయా సేవలను కొనసాగించడానికి వీలుగా ప్రభుత్వం స్పెక్ట్రమ్ వేలాన్ని 2024 జూన్ 2 వ తేదీ న, అంటే మంగళవారం నాడు నిర్వహిస్తున్నది. దేశ పౌరుల కు అత్యాధునికమైన నాణ్యత కలిగిన టెలికం సేవల ను తక్కువ ఖర్చు లో అందజేయాలన్న ప్రభుత్వ నిబద్ధత కు అనుగుణం గా ఈ వేలం ప్రక్రియ ఉంది.
స్పెక్ట్రమ్ ఆక్షన్ ఎండ్ నోటీస్ ఇన్‌వైటింగ్ అప్లికేషన్స్ (ఎన్ఐఎ) ను టెలికమ్యూనికేషన్స్ విభాగం (డిఒటి) 2024 మార్చి నెల 8 వ తేదీ నాడు జారీ చేసింది. రాబోయే వేలంపాట లో బిడ్ లు దాఖలు చేయడం కోసం స్పెక్ట్రమ్ బ్యాండ్ లు: 800 మెగా హెర్ట్ జ్ (ఎమ్‌హెచ్‌జడ్), 900 ఎమ్‌హెచ్‌జడ్, 1800 ఎమ్‌హెచ్‌జడ్, 2100 ఎమ్‌హెచ్‌జడ్, 2300 ఎమ్‌హెచ్‌జడ్, 2500 ఎమ్‌హెచ్‌జడ్, 3300 ఎమ్‌హెచ్‌జడ్ మరియు 26 గీగా హెర్ట్ జ్ (జిహెచ్‌జడ్)లు లభించనున్నట్లు కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రిజర్వు ధరల వద్ద 96,238.45 కోట్ల రూపాయల విలువైన వివిధ బ్యాండులలోని మొత్తం 10,522.35 ఎమ్‌హెచ్‌జడ్ స్పెక్ట్రమ్ ను వేలం వేయడం జరుగుతున్నది.
బ్యాండు
|
వేలాని కి ఉంచిన మొత్తం స్పెక్ట్రమ్ (మెగాహెర్ట్ జ్ లో)
|
స్పెక్ట్రమ్ ను విక్రయించే ఎల్ఎస్ఎ ల సంఖ్య
|
రిజర్వు ధర వద్ద స్పెక్ట్రమ్ యొక్క విలువ (కోట్ల రూపాయల లో)
|
800 ఎమ్‌హెచ్‌జడ్
|
118.75
|
19
|
21341.25
|
900 ఎమ్‌హెచ్‌జడ్
|
117.2
|
22
|
15619.6
|
1800 ఎమ్‌హెచ్‌జడ్
|
221.4
|
22
|
21752.4
|
2100 ఎమ్‌హెచ్‌జడ్
|
125
|
15
|
11810
|
2300 ఎమ్‌హెచ్‌జడ్
|
60
|
6
|
4430
|
2500 ఎమ్‌హెచ్‌జడ్
|
70
|
5
|
2300
|
3300 ఎమ్‌హెచ్‌జడ్
|
1110
|
22
|
16251.2
|
26 జిహెచ్‌జడ్
|
8700
|
21
|
2734
|
మొత్తం
|
10,522.35
|
|
96,238.45
|
స్పెక్ట్రమ్ వేలం తాలూకు ముఖ్యాంశాలు:
· వేలం లో ముగ్గురు బిడ్డర్ లు.. మెసర్స్ భారతి ఎయర్ టెల్ లిమిటెడ్, మెసర్స్ వోడఫోన్ ఐడియా లిమిటెడ్ మరియు మెసర్స్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్.. పాలుపంచుకోనున్నారు.
· వేలం తాలూకు ప్రక్రియ : వేలాన్ని అదే సమయం లో అనేక దశల లో పెరుగుతూ పోయే దఫాల వారి (ఎస్ఎమ్ఆర్ఎ) ఎలక్ట్రానిక్ ఆక్శన్ పద్దతి లో నిర్వహించడం జరుగుతుంది.
- స్పెక్ట్రమ్ యొక్క కాల పరిమితి: స్పెక్ట్రమ్ ను ఇరవై (20) సంవత్సరాల కాలాని కి గాను అప్పగించడం జరుగుతుంది.
- చెల్లింపు: సఫలమైన బిడ్ ను సమర్పించిన సంస్థ 8.65 శాతం వడ్డీ రేటు తో ఎన్‌పివి ని విధ్యుక్తం గా పదిలపరుస్తూ 20 సమాన వార్షిక వాయిదాల లో చెల్లింపు జరిపేందుకు అనుమతి ని ఇవ్వడం జరుగుతుంది.
- స్పెక్ట్రమ్ ను తిరిగి ఇచ్చేయడం: ఈ వేలం ద్వారా సంపాదించిన స్పెక్ట్రమ్ ను కనీసం పది సంవత్సరాల గడువు తరువాత వాపసు చేయవచ్చును.
- స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జ్: ఈ వేలం లో పొందిన స్పెక్ట్రమ్ కోసం ఎటువంటి స్పెక్ట్రమ్ ఉపయోగ ఖర్చులు (ఎస్‌యుసి) ఉండవు.
- బ్యాంకు గ్యారంటీ లు: సఫలమైన బిడ్ ను సమర్పించిన సంస్థ ఫైనాన్శియల్ బ్యాంకు గ్యారంటీ (ఎఫ్‌బిజి) మరియు పర్‌ఫార్మెన్స్ బ్యాంకు గ్యారంటీ (పిబిజి) లను సమర్పించనక్కరలేదు.
బిడ్డర్ లు ఇ-ఆక్శన్ ప్లాట్ ఫార్మ్ ను గురించి తెలుసుకొనేటందుకు గాను నమూనా వేలాలను 2024 జూన్ 3వ తేదీ, జూన్13 వ తేదీ మరియు జూన్ 14 వ తేదీల లో నిర్వహించడమైంది. ఆ తరువాత, బిడ్డర్ ల తాలూకు డేటా లో ఎటువంటి కచ్చితత్వ లోపాలు లేకుండా చూడడం కోసం ఆక్శన్ కేటలాగు ను 2024 జూన్ 24 వ తేదీ నాడు ఉదయం 9 గంటల కు ప్రచురించడమైంది. ప్రత్యక్ష వేలం 2024 జూన్ 25 వ తేదీ నాడు ఉదయం పూట 10 గంటల కు మొదలవుతుంది.
స్పెక్ట్రమ్ వేలం తాలూకు మరిన్ని వివరాల ను, వాటి లో ఇతర అంశాల తో పాటుగా, రిజర్వు ధర, ప్రి-క్వాలిఫికేషన్ షరతులు, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఇఎమ్‌డి), వేలం సంబంధి నియమాలు మొదలైన అంశాలు సహా పైన ప్రస్తావించిన ఇతర నియమ నిబంధనలు కలసి ఉన్నాయో, వాటిని ఎన్ఐఎ లో పేర్కొనడమైంది. వాటిని డిఒటి వెబ్ సైట్ అయిన https://dot.gov.in/spectrum లో చూడవచ్చును.
***
(Release ID: 2028483)
Visitor Counter : 123