సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రచురణల విభాగం ప్రచురించిన మరియు మేరిటైం ముంబయిమ్యూజియం సొసైటి సంకలన పరచిన ‘గేట్ వేస్ టు ద సీ: హిస్టారిక్ పోర్ట్ స్ ఎండ్ డాక్స్ ఆఫ్ ముంబయి రీజన్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మహారాష్ట్ర గవర్నరు

Posted On: 24 JUN 2024 3:47PM by PIB Hyderabad

గేట్ వేస్ టు ద సీ: హిస్టారిక్ పోర్ట్ స్ ఎండ్ డాక్స్ ఆఫ్ ముంబయి రీజన్పేరు తో ఉన్న ఒక గ్రంథాన్ని మహారాష్ట్ర గవర్నరు శ్రీ రమేశ్ బైస్ 2024 జూన్ 22 వ తేదీ న (శనివారం నాడు) ముంబయి లోని రాజ్ భవన్ లో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని భారత ప్రభుత్వ సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన ప్రచురణల విభాగం ప్రచురించింది. మేరిటైం ముంబయి మ్యూజియం సొసైటి (ఎమ్ఎమ్ఎమ్ఎస్) సంకలనం చేసిన ఈ గ్రంథం లో ప్రముఖ రచయితలు వ్రాసిన పద్దెనిమిది వ్యాసాలు ఉన్నాయి.

 

మహారాష్ట్ర గవర్నరు శ్రీ రమేశ్ బైస్ ఈ సందర్భం గా ఎమ్ఎమ్ఎమ్ఎస్ మరియు 17 మంది రచయితల ను, ఇద్దరు సంపాదకుల ను సన్మానించారు. ముంబయి ప్రాచీన సముద్ర సంబంధి చరిత్ర ను గురించి తెలుసుకోండంటూ ముంబయి పౌరుల ను ప్రోత్సహించారు. ప్రచురణల విభాగం మరియు ఏశియాటిక్ సొసైటి లు కలసి రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో ఈ పుస్తకం తాలూకు ఒక ప్రజెంటేషన్ ను ఇచ్చాయి. సభ కు తరలివచ్చిన వారి లో ఆహ్వానాలను అందుకొన్న చరిత్రకారులు మరియు చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నారు.

 

ఎమ్ఎమ్ఎమ్ఎస్ సంకలనం చేసిన ఈ పుస్తకం లో సోపారా, వసయి, వర్సోవ, మాహిమ్, కల్యాణ్, ఠాణె, పన్ వెల్, అలీబాగ్, చౌల్, మండద్ మరియు జంజీరా ల వంటి ముంబయి లోని ప్రాంతాల యొక్క విభిన్న నౌకాశ్రయాలు మరియు రేవుల చరిత్ర ను గురించిన ఆధికారిక వ్యాసాలు ఉన్నాయి. చరిత్రకారులు, పరిశోధకులు, సముద్ర సంబంధి నిపుణులు, సంరక్షణ వాస్తుశిల్పులు మరియు రచయితలు మొత్తం పద్దెనిమిది అధ్యాయాలను అందించారు. పైన ప్రస్తావించిన ప్రాచీన నౌకాశ్రయాలను గురించిన చైతన్యాన్ని వ్యాప్తి చేయడం లో ఈ పుస్తక ప్రచురణ ఒక ప్రముఖమైన మైలురాయి గా నిలవడం తో పాటు దీనిలో మఝ్ గాఁవ్ రేవు, ముంబయి నౌకాశ్రయం, బాంబే డాక్, ససూన్ డాక్, ఇంకా భావుచా ధక్కా అనే పేరు తో ప్రసిద్ధి ని పొందిన ఫెరీ వార్ఫ్ సహా ముంబయి లోని ఆధునిక ఓడరేవుల మరియు రేవుల అభివృద్ధి అనే అంశాలను కూడా చేర్చడమైంది.

 

ఈ కార్యక్రమం లో మేరిటైం ముంబయి మ్యూజియం సొసైటీ యొక్క అధ్యక్షుడు కెప్టెన్ శ్రీ కె.డి. బహల్, వైస్ ఎడ్ మిరల్ (రిటైర్ డ్) శ్రీ ఇంద్రశీల్ రావు, ఎడిటర్ డాక్టర్ శెఫాలి శాహ్ గారు, ఉపాధ్యక్షురాలు అనిత యెవాలె గారు, ప్రచురణల విభాగం యొక్క డిప్యూటీ డైరెక్టరు సంగీత గోడ్ బోలె గారు మరియు సహాయ రచయితలు పాల్గొన్నారు.

 

 

***

 


(Release ID: 2028479) Visitor Counter : 69