వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

64వ ఐఎస్ఓ కౌన్సిల్ సమావేశాన్ని 2024 జూన్ 25 నుండి 27వ తేదీ వరకు నిర్వహించనున్న భారత్


ఐఎస్ఓ సదస్సులో పాల్గొనున్న 30కి పైగా దేశాల ప్రతినిధులు

Posted On: 24 JUN 2024 2:34PM by PIB Hyderabad

భారతదేశం  జూన్ 25 నుండి 27, 2024 వరకు న్యూఢిల్లీలో షుగర్ సెక్టార్ పై ‘ఐఎస్ఓ కౌన్సిల్ మీటింగ్’ పేరుతో ఒక గ్లోబల్ సదస్సును నిర్వహిస్తోంది. చక్కెర, జీవ ఇంధన రంగానికి సంబంధించిన క్లిష్టమైన సమస్యలపై చర్చించేందుకు 30 కంటే ఎక్కువ దేశాల నుండి ప్రతినిధులు, అనేక అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు దీనిలో పాల్గొంటున్నారు.

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుగాను, రెండవ అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుగాను ఉన్నందున, ఐఎస్ఓ కౌన్సిల్ 2024కి భారతదేశాన్ని సంస్థ అధ్యక్ష స్థానానికి నామినేట్ చేసింది. సమావేశంలో భాగంగా, అంతర్జాతీయ ప్రతినిధుల పారిశ్రామిక పర్యటనతో భారతదేశం ఈవెంట్‌ల శ్రేణిని ప్రారంభిస్తోంది. జీవ ఇంధనాలు, ఇతర ఉప-ఉత్పత్తులలో భారతదేశం వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతికతను చూడడానికి ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో డిస్టిలరీని ప్రతినిధులు సందర్శిస్తారు. .

25.06.2024న, భారత్ మండపంలో ‘చక్కెర మరియు జీవ ఇంధనాలు – ఎమర్జింగ్ విస్టాస్’ పేరుతో వర్క్‌షాప్ జరుగుతుంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈ వర్క్‌షాప్‌ను ప్రారంభిస్తారు.

అంతర్జాతీయ ప్రతినిధులు, భారతీయ చక్కెర మిల్లుల యాజమాన్యాలు, ఐఎస్ఎంఏ, ఎన్ఎఫ్సిఎస్ఎఫ్ వంటి పరిశ్రమల సంఘాలతో పాటు సాంకేతిక నిపుణులు వర్క్‌షాప్‌లో పాల్గొంటున్నారు. ప్రపంచ చక్కెర రంగం, జీవ ఇంధనాలు, సుస్థిరత, రైతుల పాత్ర మొదలైన వాటిపై ప్రపంచ భవిష్యత్తు దృక్పథాన్ని చర్చించడానికి వివిధ సంస్థలు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి 200 మందికి పైగా ప్రతినిధులకు ఈ ఫోరమ్ అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. అలయన్స్, గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంగా ప్రపంచంలోని స్థిరమైన జీవ ఇంధనాల అభివృద్ధి, స్వీకరణను ప్రోత్సహించడానికి దేశాలను ఒకచోట చేర్చడంలో గౌరవ ప్రధాని శ్రీ నరేందర్ మోదీ చొరవతో దేశం ముందుకు వెళ్తోంది. ఐఎస్ఓ, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్‌లోని అనేక సభ్య దేశాలు సాధారణ, జీవ ఇంధనాల కూటమి ప్రోత్సాహాన్ని విస్తరించడానికి ఇది మరొక వేదిక అవుతుంది.

ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) అనేది లండన్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న యుఎన్ అనుబంధ సంస్థ. ఐఎస్ఓ లో దాదాపు 85 దేశాలు సభ్యులుగా ఉన్నాయి, ఇది ప్రపంచంలోని చక్కెర ఉత్పత్తిలో దాదాపు 90% కవర్ చేస్తుంది. చక్కెర రంగానికి సంబంధించిన సమస్యలతో పరస్పర అవగాహన, ప్రగతిశీల విధానాన్ని తీసుకురావడానికి ప్రధాన చక్కెర ఉత్పత్తి చేసే, వినియోగించే, వర్తకం చేసే దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడం తప్పనిసరి. ఐఎస్ఓ జీవ ఇంధనాలపై కూడా పని చేస్తోంది, ముఖ్యంగా ఇథనాల్ కు సంబంధించి... చెరకు ప్రపంచంలో ఇథనాల్ ఉత్పత్తికి రెండవ ప్రధాన ఫీడ్‌స్టాక్.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రతినిధుల కోసం 25.06.2024 సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు,  విభిన్నమైన, గొప్ప భారతీయ సంస్కృతి సంగ్రహావలోకనం అందిస్తుంది. 

ప్రధానంగా ఈ సదస్సు వివిధ క్రియాత్మక అంశాలపై దృష్టి సారిస్తుంది. ఐఎస్ఓ ఆర్థికవేత్తలు నిర్వహించిన కొన్ని అధ్యయనాల ప్రదర్శనను కూడా ఇస్తారు. ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి శ్రీ సంజీవ్ చోప్రా, సంస్థ ఛైర్మన్ హోదాలో, 26 - 27 జూన్ 2024న సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.

27.06.2024 సాయంత్రం న్యూఢిల్లీలోని ఎర్రకోటకు గైడెడ్ టూర్,  28.06.2024న న్యూ ఢిల్లీలోని ప్రధాన మంత్రుల మ్యూజియం, లైబ్రరీని సందర్శించడంతో కార్యక్రమం ముగుస్తుంది. 

మొత్తంమీద, వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం షుగర్, బయోఫ్యూయల్ రంగానికి సంబంధించిన మేధోమథనం, చర్చ, విద్యాసంబంధ అధ్యయనాలు అలాగే ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేటివ్ పనితీరుపై సమిష్టిగా సమాలోచనలు జరుగుతాయి. ఈ ప్రతిష్టాత్మకమైన సదస్సు ఈ రంగంలో భారతదేశ నాయకత్వానికి అద్దం పడుతోంది.

 

***



(Release ID: 2028474) Visitor Counter : 32