భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

2024 సార్వత్రిక ఎన్నికల ఈవీఎంలలో ఉపయోగించిన మెమోరీ/మైక్రోకంట్రోలర్ తనిఖీ లేదా ధృవీకరణ అందిన 11 దరఖాస్తులు

Posted On: 20 JUN 2024 2:28PM by PIB Hyderabad

జూన్ 1, 2024 నాటి ఎన్నికల సంఘం ఎస్ఓపీ ప్రకారం ఫలితాల వెల్లడి అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో(ఈవీఎం) ఉపయోగించిన మెమోరీ/మైక్రోకంట్రోలర్ తనిఖీ లేదా ధృవీకరణ కోసం 11 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 8 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు, 3 రాష్ట్ర శాసన సభల సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినవి ఉన్నాయి. వివరాలు కింది విధంగా ఉన్నాయి.

 

లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు, 2024

ఈవీఎం తనిఖీ, ధృవీకరణ కోసం వచ్చిన దరఖాస్తులు

వరుస సంఖ్య

రాష్ట్రం పేరు

రెండో, మూడో స్థానంలో ఉన్న అభ్యర్థి పార్టీ వివరాలు(పార్టీ ఉన్నట్లయితే)

పార్లమెంట్ నియోజకవర్గం పేరు

అసెంబ్లీ నియోజకవర్గం పేరు

తనిఖీ/వెరిఫికేషన్ కోసం ఎంపికైన పోలింగ్ స్టెషన్ల సంఖ్య

1

ఆంధ్రప్రదేశ్

వైఎస్ఆర్‌సీపీ

విజయనగరం

బొబ్బిలి

1

నెళ్లిమర్ల

1

మొత్తం

2

2

ఛత్తీస్‌గఢ్

కాంగ్రెస్(ఐఎన్‌సీ)

కాంకర్

సంజారీ బలోద్

2

గుండెర్‌దేహీ

1

సిహావా

1

మొత్తం

4

3

హర్యానా

కాంగ్రెస్

కర్నాల్

కర్నాల్

2

పానిపట్ సిటీ

2

ఫరీదాబాద్

బాడ్కల్

2

మొత్తం

6

4

మహారాష్ట్ర

బీజేపీ

అహ్మద్‌నగర్

షెవ్‌గాన్

5

రుహరీ

5

పార్నర్

10

అహ్మద్ నగర్ సిటీ

5

శ్రీగొండ

10

 

 

 

 

 

కార్జత్ జమ్కెడ్

5

మొత్తం

40

5

తమిళనాడు

బీజేపీ

వెల్లూర్

వెల్లూర్

1

అనాయ్‌కట్

1

కేవీ కుప్పం

1

గుడియతం

1

వానియంబి

1

అంబూర్

1

డీఎండీకే

విరుదునగర్

విరుదునగర్r

14

 

మొత్తం

20

6

తెలంగాణ

బీజేపీ

జహీరాబాద్

నారాయణ్‌ఖేడ్

7

జహీరాబాద్

7

ఆంధోల్ (ఎస్సీ)

6

మొత్తం

20

మొత్తం రాష్ట్రాలు – 6

మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాలు -8
మొత్తం పోలింగ్ స్టేషన్లు- 92

రాష్ట్ర అసెంబ్లీల సార్వత్రిక ఎన్నికలు 2024
ఈవీఎంల తనిఖీ/వెరిఫికేషన్ కోసం వచ్చిన దరఖాస్తులు

 

వరుస సంఖ్య

రాష్ట్రం పేరు

రెండో, మూడో స్థానంలో ఉన్న అభ్యర్థి పార్టీ వివరాలు(పార్టీ ఉన్నట్లయితే)

అసెంబ్లీ నియోజకవర్గం పేరు

తనిఖీ/వెరిఫికేషన్ కోసం ఎంపికైన పోలింగ్ స్టెషన్ల సంఖ్య

1

ఆంధ్రప్రదేశ్

వైఎస్‌ఆర్‌సీపీ

గజపతినగరం

1

వైఎస్‌ఆర్‌సీపీ

ఓంగోలు

12

మొత్తం

13

2

ఓడిషా

బీజేడీ

జర్సుగూడ

13

మొత్తం రాష్ట్రాలు – 2

మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు -3
మొత్తం పోలింగ్ స్టేషన్లు- 26


జూన్ 1, 2024 నాటి ఉత్తర్వుల ద్వారా దరఖాస్తు ప్రక్రియ, తనిఖీ చేయాల్సిన యూనిట్ల విషయంలో పాటించాల్సిన ప్రోటోకాల్స్, తనిఖీ/ధృవీకరణ ప్రక్రియ నిర్వహణ విషయంలో రక్షణలు, నియంత్రణలు, అవసరమైన డాక్యుమెంటేషన్ (ఎస్ఓపి లింక్: https://tinyurl.com/yxtxys7u) కోసం వివరణాత్మక పరిపాలన ఎస్ఓపిని ఈసీఐ జారీ చేసింది.

 

ఈ ఎస్ఓపీ ప్రకారం సంబంధిత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)...ఫలితాల ప్రకటన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తుదారుల ఏకీకృత జాబితాను కమిషన్‌కు సమాచారం ఇస్తూ తయారీదారులకు తెలియజేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం 4 జూలై లోపు జూబితా తయారీదారులకు అందాల్సి ఉండగా… 15 రోజుల ముందే ఈ ప్రక్రియ పూర్తైంది.

జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌తో పాటు చట్ట ప్రకారం పైన తెలిపిన, ఎంపిక చేసిన ఆయా నియోజకవర్గాల్లో దాఖలైన ఎన్నికల పిటిషన్ స్థితిని సీఈఓలు సంబంధిత హైకోర్ట్ రిజిస్ట్రార్ల నుంచి ధృవీకరించిన 4 వారాల్లో తనిఖీ/ధృవీకరణ ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేయడానికి గడువు ఎన్నికల ఫలితాల ప్రకటన తేదీ నుంచి 45 రోజులు. ప్రస్తుత ఎన్నికల విషయంలో ఇది 19 జులై 2024. ఈవీఎం యూనిట్లలో ఉపయోగించిన మెమరీ/మైక్రోకంట్రోలర్ తనిఖీ,ధృవీకరణకు సంబంధించిన పద్ధతి, చేపట్టాల్సిన చర్యలను వివరించే సాంకేతిక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను ఎన్నికల పిటిషన్ గడువు ముగిసేలోగా కమిషన్ జారీ చేయనుంది.

సంబంధిత సీఈఓల నుంచి ఈపీ స్టేటస్ అందుకున్న రెండు వారాల్లోగా తయారీదారులు ఈవీఎం తనిఖీ, ధృవీకరణ కోసం షెడ్యూల్ జారీ చేస్తారు. ఎలక్షన్ పిటీషన్ స్టేటస్‌ను ధృవీకరించిన 4 వారాల్లో యూనిట్ల తనిఖీ,ధృవీకరణ ప్రారంభమౌతుంది. 

***


(Release ID: 2027274) Visitor Counter : 106