ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కువైత్ లో జరిగిన అగ్ని దుర్ఘటన ను గురించిసమీక్షించి న ప్రధాన మంత్రి


మృతుల కుటుంబాల కు సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి; ఈ అగ్ని ప్రమాదం లో గాయపడిన వ్యక్తులు త్వరితగతినపునఃస్వస్థులు కావాలని ఆయన ఆకాంక్షించారు

సాధ్యమైన అన్ని విధాలుగాను సాయపడాలి అనిప్రభుత్వాన్ని ఆదేశించిన ప్రధాన మంత్రి

సహాయక చర్యల నుపర్యవేక్షించడం కోసం మరియు భౌతిక కాయాలను త్వరగా స్వదేశాని కి తరలించడానికి పూచీపడడంకోసం కువైత్ కు వెళ్ళనున్న విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి

ప్రాణాల ను కోల్పోయిన భారత జాతీయుల కుటుంబాల కు  ప్రధాన మంత్రి సహాయ నిధి నుండి రెండు లక్షల రూపాయలవంతున  పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి 

Posted On: 12 JUN 2024 10:00PM by PIB Hyderabad

కువైత్ లో మంటలు చెరరేగిన దుర్ఘటన జరిగిన నేపథ్యం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని నంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని తన నివాసం లో జరిగిన ఒక సమీక్షా సమావేశానికి అధ్యక్షతను వహించారు. ఈ అగ్ని ప్రమాదం లో అనేక మంది భారత జాతీయులు మరణించారు, మరెంతో మంది గాయపడ్డారు.

 

దురదృష్ట వశాత్తు సంభవించిన ఈ ఘటన పట్ల ప్రధాన మంత్రి తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు; మృతుల కుటుంబాల కు ఆయన సంతాపాన్ని తెలియ జేశారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు శీఘ్రం గా పునఃస్వస్థులు కావాలని ఆయన ఆకాంక్షించారు.

 

చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందించవలసిందంటూ భారతదేశం ప్రభుత్వాని కి ప్రధాన మంత్రి ఆదేశాల ను ఇచ్చారు. సహాయక చర్యల ను పర్యవేక్షించడం కోసం మరియు పార్థివ శరీరాల ను త్వరిత గతి న స్వదేశాని కి తీసుకురావడం కోసం విదేశీ వ్వహారాల శాఖ మంత్రి వెంటనే కువైత్ కు బయలుదేరివెళ్లాలని ప్రధాన మంత్రి సూచించారు.

 

మృతులలో భారతీయ పౌరుల యొక్క కుటుంబాల కు ప్రధాన మంత్రి సహాయ నిధి నుండి రెండేసి లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి ప్రకటించారు.

 

ఈ సమావేశం లో విదేశీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ ఎస్. జయ్ శంకర్, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తివర్ధన్ సింహ్, ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి శ్రీ ప్రమోద్ కుమార్ మిశ్ర, జాతీయ భద్రత విషయాలలో సలహాదారు శ్రీ అజీత్ డోభాల్, విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ వినయ్ క్వాత్రాలతో పాటు ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

 

***


(Release ID: 2024950) Visitor Counter : 67