ఉక్కు మంత్రిత్వ శాఖ

ఉక్కుప‌రిశ్ర‌మ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన శ్రీ హెచ్.డి. కుమారస్వామి

Posted On: 11 JUN 2024 8:08PM by PIB Hyderabad

ఉద్యోగ భ‌వ‌న్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కేంద్ర ఉక్కుప‌రిశ్ర‌మ శాఖ మంత్రిగా మంత్రి శ్రీ హెచ్ డి కుమారస్వామి బాధ్య‌త‌లు స్వీకరించారు. భారీ ప‌రిశ్ర‌ముల శాఖ మంత్రిగా కూడా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
 


ఉక్కుశాఖ కార్య‌ద‌ర్శి శ్రీ నాగేంద్ర‌నాధ్ సిన్హాతో పాటు ప‌లువురు సీనియ‌ర్ అధికారులు మంత్రికి స్వాగ‌తం ప‌లికారు. 

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి శ్రీ హెచ్‌.డి.దేవెగౌడ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ బలోపేతానికి నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేస్తాన‌ని అన్నారు. జిడిపి పెరుగుద‌లే లక్ష్యంగా కృషి చేస్తాన‌ని చెప్పారు. దేశం యావ‌త్తూ సుభిక్షంగా వుండాలంటే అంద‌రూ క‌లిసి అవిశ్రాంతంగా ప‌ని చేయాల‌ని అన్నారు. 

ఉక్కు ప‌రిశ్ర‌మ శాఖ‌లోని వివిధ అంశాల‌ను అధికారుల‌ద్వారా కేంద్ర‌మంత్రి తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న వారితో స‌మావేశం నిర్వ‌హించారు. 

***
 



(Release ID: 2024559) Visitor Counter : 41