మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ జార్జి కురియెన్
प्रविष्टि तिथि:
11 JUN 2024 6:08PM by PIB Hyderabad
కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయమంత్రిగా శ్రీ జార్జి కురియెన్ నేడు బాధ్యతలు స్వీకరించారు. 2024 జూన్ 9వ తేదీన రాష్ర్టపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయమంత్రిగా శ్రీ జార్జి కురియెన్ తో రాష్ర్టపతి ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ కటికతల శ్రీనివాస్, ఇతర సీనియర్ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు.

శ్రీ కురియెన్ కేరళలోని ఎట్టుమానూర్ సమీపంలోని నంబియాకుళం వాసి. ఆయన ఎల్ఎల్ బి గ్రాడ్యుయేట్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. సుప్రీంకోర్టులో ఆయన న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేస్తున్నారు. గతంలో ఆయన జాతీయ మైనారిటీల కమిషన్ వైస్ చైర్మన్ గా పని చేశారు.
ఈ సందర్భంగా శ్రీ కురియెన్ మాట్లాడుతూ తనకు కేంద్రమంత్రిగా అవకాశం కల్పించినందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దేశంలో మైనారిటీ తెగల సామాజిక-ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు తాను కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
***
(रिलीज़ आईडी: 2024545)
आगंतुक पटल : 129