సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి గా పదవీ బాధ్యతల ను స్వీకరించిన శ్రీ అశ్వినీ వైష్ణవ్


ప్రజల కు సేవ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, మంత్రివర్గం తీసుకొన్న తొలి నిర్ణయం పేదల కు అంకితం అయింది: శ్రీ అశ్వినీ వైష్ణవ్

प्रविष्टि तिथि: 11 JUN 2024 11:41AM by PIB Hyderabad

కేంద్ర సమాచారం మరియు ప్రసారం శాఖ మంత్రి గా శ్రీ అశ్వినీ వైష్ణవ్ పదవీ బాధ్యతల ను ఈ రోజు న ఇక్కడ స్వీకరించారు. ఈ సందర్భం లో ప్రసార మాధ్యమాల ప్రతినిధుల తో శ్రీ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కి అంకితం అయిందన్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల లో మూడు కోట్ల ఇళ్ళ ను నిర్మించాలని మంత్రివర్గం నిన్నటి రోజు న తీసుకొన్న నిర్ణయాన్ని మంత్రి పునరుద్ఘాటించారు. ప్రభుత్వం తొలి రోజు న తీసుకొన్నటువంటి ఒకటో మంత్రివర్గ నిర్ణయం పేదల సశక్తీకరణ కు సమర్పణమైందని ఆయన అన్నారు. దేశం లోని ప్రజల కు ప్రభుత్వం నిరంతరం సేవ చేస్తూ ఉంటుందని కూడా ఆయన తెలిపారు

సమాచారం మరియు ప్రసారం శాఖ మంత్రి గా సేవల ను అందించే అవకాశాన్ని తనకు ఇచ్చినందుకు గాను ప్రధాన మంత్రి కి మంత్రి తన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.

శ్రీ అశ్వినీ వైష్ణవ్ కు మంత్రిత్వ శాఖ యొక్క కార్యదర్శి శ్రీ సంజయ్ జాజూ తో పాటు ఇతర సీనియర్ అధికారులు మరియు మంత్రిత్వ శాఖ లో భాగం గా ఉన్న ప్రసార మాధ్యమాల విభాగాలు స్వాగతం పలికాయి.

***


(रिलीज़ आईडी: 2023943) आगंतुक पटल : 198
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Khasi , English , Urdu , Nepali , Marathi , हिन्दी , Hindi_MP , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam