ప్రధాన మంత్రి కార్యాలయం
క్రొత్త ప్రభుత్వం యొక్క తొలి నిర్ణయం రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వాని కి ఉన్న నిబద్ధత ను చాటిచెబుతున్నది
ప్రధాన మంత్రి సంతకం పెట్టిన తొలి ఫైలు పిఎమ్ కిసాన్ నిధి విడుదల కు సంబంధించినది
మా ప్రభుత్వం రైతుల సంక్షేమాని కి పూర్తి స్థాయి లో కట్టుబడి ఉంది. ఈ కారణం గా పదవీ బాధ్యతల ను స్వీకరించిన వెంటనే రైతుల సంక్షేమాని కి ఉద్దేశించిన తొలి ఫైలు పైన సంతకం చేయడం సరి అయింది గా ఉంది: ప్రధాన మంత్రి
మేము భవిష్యత్తు లో రైతుల కోసం మరియు వ్యవసాయ రంగం కోసం మరింత ఎక్కువ గా పాటుపడుతూ ఉండాలని కోరుకొంటున్నాం: ప్రధాన మంత్రి
Posted On:
10 JUN 2024 12:06PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి గా శ్రీ నరేంద్ర మోదీ మూడో పర్యాయం పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం పిఎమ్ కిసాన్ నిధి తాలూకు పదిహేడో కిస్తీ విడుదల కు అనుమతి ని ఇచ్చే తన తొలి ఫైలు పైన సంతకం పెట్టారు. దీనితో 9.3 కోట్ల మంది రైతుల కు ప్రయోజనం లభించనుంది; మరి, సుమారు గా 20,000 కోట్ల రూపాయల ను రైతుల కు వితరణ చేయడం జరుగనుంది.
ఫైలు పైన సంతకం చేసిన తరువాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ‘‘మా ప్రభుత్వం రైతుల సంక్షేమాని కి పూర్తి గా కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం. ఈ కారణం గా పదవీబాధ్యతల ను స్వీకరించిన తరువాత కర్షకుల సంక్షేమాని కి సంబంధించిన మొట్టమొదటి ఫైలు పైన సంతకం చేయడం సరి అయినది గా ఉంది. మేము రాబోయే కాలాల్లో రైతుల కోసం మరియు వ్యవసాయ రంగం కోసం మరింత ఎక్కువ గా పాటుపడాలి అని కోరుకొంటున్నాము’’ అన్నారు.
***
(Release ID: 2023774)
Visitor Counter : 166
Read this release in:
Odia
,
English
,
Khasi
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam