ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి యొక్క పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం కోసం నేత ల యాత్ర

Posted On: 08 JUN 2024 12:24PM by PIB Hyderabad

సాధారణ ఎన్నికలు- 2024 పూర్తి అయిన దరిమిలా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మరియు మంత్రిమండలి యొక్క పదవీప్రమాణ స్వీకారం కార్యక్రమం 2024 జూన్ 9వ తేదీ న జరుగనున్నది. ఈ సందర్భం లో, విశిష్ట అతిథులు గా హాజరు కావలసిందంటూ భారతదేశాని కి ఇరుగు పొరుగున ఉన్న దేశాల నేతల ను మరియు హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల నేతల ను హృదయపూర్వకం గా ఆహ్వానించడమైంది.



పదవీ ప్రమాణ స్వీకారం కార్యక్రమాని కి హాజరు కండి అంటూ పంపించినటువంటి ఆహ్వానాన్ని మన్నించిన వారి లో శ్రీ లంక యొక్క అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమసింఘె, మాల్దీవులు యొక్క అధ్యక్షుడు డాక్టర్ శ్రీ మొహమ్మద్ ముయిజ్జు, సెశెల్స్ యొక్క ఉపాధ్యక్షుడు శ్రీ అహ్మద్ అఫిఫ్, బాంగ్లాదేశ్ యొక్క ప్రధాని శేఖ్ హసీనా గారు, మారీశస్ యొక్క ప్రధాని శ్రీ ప్రవింద్ కుమార్ జగన్నాథ్, నేపాల్ యొక్క ప్రధాని శ్రీ పుష్ప్ కమల్ దహల్ ‘ప్రచండ’ లతో పాటు భూటాన్ యొక్క ప్రధాని శ్రీ శెరింగ్ తోబ్ గే లు ఉన్నారు.



పదవీప్రమాణ స్వీకార కార్యక్రమం లో పాలుపంచుకోవడం తో పాటు గా ఈ నేత లు అదే రోజు న సాయంత్రం పూట రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆతిథేయి గా ఉండేటటువంటి ఒక విందు లో కూడ పాలుపంచుకోనున్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క పదవీస్వీకార ప్రమాణం కార్యక్రమం ఇప్పటికి ఇది వరుస గా మూడో సారి; ఈ కార్యక్రమానికి పలువురు నేత లు విచ్చేయడం అనేది భారతదేశం అత్యంత ప్రాధాన్యాన్ని కట్టబెట్టి మరీ అనుసరిస్తున్నటువంటి ‘నేబర్ హుడ్ ఫస్ట్’ విధానానికి మరియు ‘ఎస్ఎజిఎఆర్’ (‘SAGAR’) విజన్ కు అనుగుణం గా ఉంది.

 

***

 



(Release ID: 2023648) Visitor Counter : 69