కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఇఎస్ఐసి డైరెక్టర్ జనరల్ గా పదవీ బాధ్యతల నుస్వీకరించిన శ్రీ కమల్ కిశోర్ సోన్

Posted On: 07 JUN 2024 4:18PM by PIB Hyderabad

శ్రమ మరియు ఉపాధి ల మంత్రిత్వ శాఖ ఆధీనం లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్ శూరన్స్ కార్ పొరేశన్ (ఇఎస్ఐసి) కి డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యత ను శ్రీ కమల్ కిశోర్ సోన్ 2024 మే నెల 31 వ తేదీ నాడు స్వీకరించారు. ఆయన ఝార్ ఖండ్ కేడర్ (బ్యాచ్: 1998) కు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి. ప్రస్తుతం శ్రమ & ఉపాధి ల మంత్రిత్వ శాఖ లో అడిశనల్ సెక్రట్రి గాను, డైరెక్టర్ జనరల్ గాను విధుల ను నిర్వహిస్తున్నారు.

 

 

శ్రీ కమల్ కిశోర్ సోన్ కు ఝార్‌ఖండ్ రాష్ట్రం లో వివిధ విభాగాల యొక్క పాలన లోను మరియు నిర్వహణ లోను అపారమైన అనుభవం ఉంది. ఆయన భూమి శిస్తు నిర్వహణ మరియు జిల్లా పాలన, వ్యవసాయం & సహకారం, ఆరోగ్యం, భవన నిర్మాణం, రవాణా, ఆర్థిక వ్యవహారాలు, శక్తి, జల వనరులు మరియు సామాజిక న్యాయం, ఇంకా సాధికారిత కల్పన మొదలైన విభాగాల లో సేవల ను అందించారు.

 

 

**

 



(Release ID: 2023524) Visitor Counter : 70