రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారత సైన్యం ఆధ్వర్యంలో 76వ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం

Posted On: 29 MAY 2024 2:45PM by PIB Hyderabad

ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల 76 వ అంతర్జాతీయ దినోత్సవాన్ని భారత సైన్యం ఈరోజు ఘనంగా నిర్వహించింది.76వ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద మరణించిన సహచరులకు నివాళులర్పించింది. లెఫ్టినెంట్ జనరల్ రాకేష్


కపూర్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ , కోఆర్డినేషన్), ఐక్యరాజ్య సమితి అధికారులు, రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. మొదటి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల బృందం "యూఎన్ ట్రూస్ సూపర్‌విజన్ ఆర్గనైజేషన్ (UNTSO)" పేరుతో 76 సంవత్సరాల కిందట 1948లో పాలస్తీనాలో ఇదే రోజున కార్యకలాపాలు ప్రారంభించింది. శాంతి పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా అంకితభావం ధైర్యం, నైపుణ్యంతో సేవలు అందించిన/ అందిస్తున్న మహిళలు, పురుషులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఘనంగా నివాళులు అర్పిస్తూ. శాంతి కోసం తమ ప్రాణాలను అర్పించిన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటాయి.
 

ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల కార్యకలాపాలకు భారతదేశం తొలుత నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. శాంతి పరిరక్షణ బృందాల్లో భారత సిబ్బంది పెద్ద సంఖ్యలో సేవలు అందిస్తున్నారు. శాంతి పరిరక్షక


కార్యకలాపాలకు భారతదేశం సుమారు 2,87,000 మంది సైనికుల సేవలు అందించింది. భారత ఆర్మీ సిబ్బంది కష్టతరమైన, సవాళ్లతో కూడిన భూభాగం, కార్యాచరణ పరిస్థితుల్లో పనిచేశారు ఐక్యరాజ్య సమితి ఆశయాలు సాధించేందుకు అత్యున్నత ఆదర్శప్రాయమైన ధైర్యం, పరాక్రమాన్ని ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పేందుకు జరిగిన ప్రయత్నాలలో భారతదేశానికి చెందిన 160 మంది సైనికులు ప్రాణ త్యాగం చేశారు. ప్రస్తుతం భారత సాయుధ దళాలు తొమ్మిది దేశాల్లో మోహరించిన యుఎన్డిఓఎఫ్, యునిఫిల్, యుఎన్ఎఫ్ఐసిపి, మోనుస్కో, యుఎన్ఎంఐఎస్ఏ, యునిఫ్సా, మైనస్కా, మినుర్సో లో భారత సాయుధ దళాలు సేవలు అందిస్తున్నాయి.
 

ఐక్యరాజ్యసమితి, ఆతిథ్య దేశాలు మరియు భాగస్వామ్య దేశాల సిబ్బంది సామర్థ్య అభివృద్ధి లో భారతదేశం ముందంజలో ఉంది. చురుకైన యూనిట్ల అభివృద్ధి , శాంతి పరిరక్షకుల శిక్షణ, రవాణా, లింగ సమానత్వాన్ని పెంపొందించడం ,సాంకేతిక అభివృద్ధి లాంటి కార్యక్రమాల ద్వారా ఐక్యరాజ్య సమితి కార్యక్రమాలు పటిష్టంగా అమలు జరిగేలా చూసేందుకు భారతదేశం ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. శిక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి,,సివిల్ మిలిటరీ కోఆర్డినేషన్ (CIMIC) కార్యకలాపాలను అందించడం ద్వారా ఆతిథ్య దేశ సామర్థ్య అభివృద్ధి కార్యకలాపాలకు భారతదేశం క్రియాశీల మద్దతును అందిస్తోంది. అదనంగా, భారత సైన్యం కి చెందిన పశు సంవర్ధక విభాగాలు ఐక్యరాజ్య సమితి


ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న మిషన్‌లలో గణనీయమైన పనితీరును ప్రదర్శించాయి. సుడాన్‌లో కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ గుర్‌ప్రీత్ సింగ్ బాలి నేతృత్వంలో పని చేసిన భారత బృందం అబైలో పశువుల ఆరోగ్యం మెరుగు పడేందుకు చేసిన కృషిని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ప్రత్యేకంగా ప్రశంసించింది. శాంతి పరిరక్షక కార్యకలాపాలకు అవసరమైన శిక్షణ అందించేందుకు భారత సైన్యం న్యూఢిల్లీలో సెంటర్ ఫర్ యూఎన్ పీస్ కీపింగ్ (CUNPK)ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ప్రతి సంవత్సరం 12,000 పైగా సైనికులకు శిక్షణ ఇస్తుంది. శాంతి
పరిరక్షణ బృందాలు,శిక్షకుల కోసం కేంద్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ అనేక కార్యకలాపాలు చేపట్టింది. ఉత్తమ అభ్యాసాలు పంచుకోవడంలో భాగంగా విదేశీ ప్రతినిధులకు కూడా శిక్షణ ఇస్తోంది. శాంతి పరిరక్షక శిక్షణ రంగంలో సామర్థ్యం పెంపొందించడం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా స్నేహపూర్వక విదేశీ దేశాలకు మొబైల్ శిక్షణ బృందాలను కేంద్రం క్రమం తప్పకుండా పంపుతుంది. ఇన్‌స్టిట్యూట్ గత రెండు దశాబ్దాల్లో ఎక్స్‌లెన్స్ సెంటర్‌గా మరియు అనుభవం, ఉత్తమ అభ్యాసాల కేంద్రంగా అభివృద్ధి చెందింది.

 

ఐక్యరాజ్య సమితి మిషన్లలో పాల్గొంటున్న సిబ్బందికి భారత సైన్యం అత్యాధునిక పరికరాలు,వాహనాలు సమకూర్చింది. ఈ వాహనాలు,పరికరాలు భారతదేశంలో తయారు అయ్యాయి. మిషన్ ఆమెకు జరుగుతున్న ప్రాంతాల క్లిష్ట భూభాగాలు, వాతావరణం ,కార్యాచరణ పరిస్థితులను తట్టుకుని పని చేస్తున్నాయి. స్థానిక మహిళల అవసరాలు, సమస్యలు పరిష్కరించడానికి శాంతి పరిరక్షణ బృందంలో మహిళలు తగిన సంఖ్యలో ఉండాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఐక్యరాజ్యసమితి తీసుకున్న నిర్ణయానికి భారతదేశం పూర్తి మద్దతు ప్రకటించింది. మహిళా శక్తిని ప్రదర్శించడానికి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అబీ లో పెద్ద సంఖ్యలో మహిళా సిబ్బందితో మహిళా ఎంగేజ్‌మెంట్ టీమ్‌లను (FETలు) మోహరించింది.లైబీరియా తర్వాత రెండో అతిపెద్ద మహిళా బృందంగా భారతీయ మహిళా బృందం గుర్తింపు పొందింది. గోలన్ హైట్స్‌లో మహిళా
సైనిక పోలీసులను మోహరించిన భారతదేశం వివిధ మిషన్లలో మహిళా అధికారులు /మిలిటరీ పరిశీలకులను ఏర్పాటు చేసింది. అవసరాలకు అనుగుణంగా ఇతర మిషన్లకు సహకారం కూడా ఎక్కువ చేసింది . “మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ 2023” అవార్డుకు మేజర్ రాధికా సేన్‌ను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎంపిక చేసింది, శాంతి పరిరక్షక కార్యక్రమాలలో భారతీయ మహిళల సానుకూల సహకారానికి గుర్తింపుగా ఈ అవార్డు అందించారు.

 

05-06 డిసెంబర్ 2023న ఘనాలోని అక్రాలో జరిగిన UN శాంతి పరిరక్షక మంత్రిత్వ శాఖ సమావేశంలో భవిష్యత్తులో శాంతి పరిరక్షక కార్యక్రమాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భారతదేశం ప్రకటించింది. అవసరాలను తీర్చడానికి భారతదేశం ఒక పదాతి దళ బెటాలియన్ గ్రూప్, వివిధ ఉప బృందాలు అందిస్తామని హామీ ఇచ్చిన భారతదేశం ప్రీ-డిప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కోర్స్,యూఎన్ మిలిటరీ అబ్జర్వర్స్ కోర్సులను రాబోయే రెండు సంవత్సరాల కాలంలో నిర్వహిస్తామని తెలిపింది.

****



(Release ID: 2022080) Visitor Counter : 85