రక్షణ మంత్రిత్వ శాఖ
రేమల్ తుపాను ను దృష్టిలో పెట్టుకొని సన్నద్ధమైన భారతీయనౌకా దళం
प्रविष्टि तिथि:
26 MAY 2024 11:30AM by PIB Hyderabad
చక్రవాతం రేమల్ తలెత్తిన అనంతర ఒక విశ్వసనీయమైనటువంటి మానవీయ సహాయం మరియు విపత్తు ఉపశమనకారి (హెచ్ఎడిఆర్) ప్రతిస్పందన ను ఆరంభించడం కోసం వర్తమాన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఒపి స్) ను అనుసరిస్తూ ప్రారంభిక కార్యకలాపాల ను భారతీయ నౌకాదళం మొదలు పెట్టేసింది. చక్రవాతం 2024 మే 26/27 వ తేదీ ల మధ్య రాత్రి కోస్తా తీర ప్రాంతాన్ని దాటవచ్చునన్న అంచనా ఉంది. నౌకా దళం ప్రధాన కేంద్రం లో స్థితి ని నిశితంగా పర్యవేక్షించడం జరుగుతున్నది. దీనితో పాటే, ఈస్టర్న్ నావల్ కమాండ్ యొక్క ప్రధాన కేంద్రం ద్వారా విస్తృతమైన సన్నాహక చర్యల ను చేపట్టడం జరుగుతోంది.
చక్రవాతం రేమల్ మహా చక్రవాతం గా మారవచ్చన్న అనుమానాటు ఉన్నాయి. అది పశ్చిమ బంగాల్ లోని సాగర్ ద్వీపానికి మరియు బాంగ్లాదేశ్ లోని ఖేపుపారా కు మధ్య తీరాన్ని దాటవచ్చునన్న ముందస్తు అంచనా ను వేయడమైంది. ప్రభావిత ప్రజానీకం యొక్క సురక్ష కు మరియు సంక్షేమానికి పూచీ పడడం కోసమని భారతీయ నౌకా దళం తత్ క్షణం మోహరించడానికి గాను హెచ్ఎడిఆర్ మరియు ఔషధాల ను సమకూర్చిన రెండు నౌకలను సిద్ధం చేసింది. వీటికి అదనం గా, సీ కింగ్, ఇంకా చేతక్ హెలికాప్టర్ లను, డోర్నియర్ విమానాలు సహా భారతీయ నౌకా దళాని కి చెందిన విమానాలు శీఘ్ర స్పందన నిమిత్తం సన్నద్ధం గా ఉన్నాయి.
త్వరిత సహాయాన్ని అందించడం కోసం సామగ్రి సహా ప్రత్యేక ఈతగాళ్ళ బృందాల ను కోల్‌కాతా లో మోహరించడమైంది. ఆవశ్యక ఉపకరణాల తో ఈతగాళ్ళ అదనపు బృందాలు విశాఖపట్నం లో సన్నద్ధం అయ్యి, అవసరపడినప్పడు వెనువెంటనే రంగం లోకి దిగడానికి తయారు గా ఉన్నాయి. హెచ్ఎడిఆర్ మరియు మందుల సరఫరా హంగుల తో రెండు వరద సహాయ బృందాల (ఎఫ్ఆర్‌టి స్)ను కోల్‌కాతా లో సర్వసన్నద్ధం గా ఉంచడమైంది. వీటికి తోడు విశాఖపట్నం లోను, చిల్కా లోను రెండేసి ఎఫ్ఆర్‌టి స్ తయారు గా ఉన్నాయి అవి అల్ప సమాచారం అందగానే మోహరించడాని కి సిద్ధం గా ఉన్నాయి.
భారతీయ నౌకా దళం అప్రమత్తం అయింది చక్రవాతం రేమల్ ను దృష్టి లో పెట్టుకొని తత్ క్షణ మరియు ప్రభావశీల సహాయాన్ని అందించడం కోసం మారుతున్న స్థితి ని నిశితం గా పరిశీలిస్తున్నది.
***
(रिलीज़ आईडी: 2021819)
आगंतुक पटल : 136