ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తర బంగాళాఖాతం లో ఏర్పడ్డ ‘‘రేమల్’’ చక్రవాతాన్ని దృష్టి లో పెట్టుకొని తీసుకొంటున్న సన్నాహక చర్యల ను సమీక్షించిన ప్రధాన మంత్రి; ఈ మహాచక్రవాతం పశ్చిమ బంగాల్ లో మరియు ఈశాన్య ప్రాంత రాష్ట్రాల లో తీరం దాటవచ్చనే అంచనాలున్నాయి
రాష్ట్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వం పూర్తి సమర్థన ను అందించిందన్న ప్రధాన మంత్రి ; అదే విధమైన సమర్థన ను తప్పక అందిస్తూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు
దక్షిణ బంగాళాఖాతం లోకి అడుగు పెట్టొద్దని మత్స్యకారుల కు సలహా ను ఇవ్వడమైంది; సుమారు ఒక లక్ష మంది ప్రజల ను సురక్షిత ప్రాంతాల కు తరలించడమైంది
దక్షిణ బంగాళాఖాతం లోకి అడుగు పెట్టొద్దని మత్స్యకారుల కు సలహా ను ఇవ్వడమైంది; సుమారు ఒక లక్ష మంది ప్రజల ను సురక్షిత ప్రాంతాల కు తరలించడమైంది
పశ్చిమ బంగాల్ మరియు ఒడిశాల లో ఇప్పటికే మోహరించిన ఎన్ డిఆర్ఎఫ్ జట్టు కు తోడు, మరిన్ని జట్టుల ను సిద్ధం గా ఉంచాలని, అవి ఒక గంట వ్యవధి లోపు రంగం లో దిగేందుకు తయారు గా ఉండాలని ఆదేశాలను ఇచ్చిన ప్రధాన మంత్రి
బాంగ్లాదేశ్ కు కూడ సమాచారం పరంగా సమర్థన ను అందించడం జరుగుతున్నది; తాజా పరిణామాల ను గురించి సైతం తెలియజేయడం జరుగుతున్నది
Posted On:
26 MAY 2024 9:19PM by PIB Hyderabad
ఉత్తర బంగాళాఖాతం లో ఏర్పడిన చక్రవాతం ‘‘రేమల్’’ ను దృష్టి లో పెట్టుకొని తీసుకొంటున్న సన్నాహక చర్యల ను సమీక్షించడం కోసమని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న 7, లోక్ కల్యాణ్ మార్గ్ లోని తన నివాసం లో నిర్వహించిన ఒక సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఐఎమ్ డి ముందస్తు అంచనా ల ప్రకారం, ఈ పెను తుపాను బాంగ్లాదేశ్ ను మరియు బాంగ్లాదేశ్ ను ఆనుకొని ఉన్న పశ్చిమ బంగాల్ కోస్తా తీర ప్రాంతాల మధ్య సాగర్ దీవులు మరియు బాంగ్లాదేశ్ లోని నైరుతి దిక్కున గల మొంగ్ లా కు సమీపం లోని ఖేపుపారా మధ్యన తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని పర్యవసానం గా పశ్చిమ బంగాల్ లోను మరియు ఈశాన్య ప్రాంత రాష్ట్రాల లోను వర్షాలు కురవవచ్చును.
జాతీయ విపత్తు నిర్వహణ సంఘం పశ్చిమ బంగాల్ ప్రభుత్వం తో క్రమం తప్పక సంప్రతింపులను జరుపుతూ ఉంది అన్న సంగతి ని ప్రధాన మంత్రి కి వివరించడమైంది. దక్షిణ బంగాళాఖాతం లోకి మరియు అండమాన్ సముద్ర ప్రాంతం లోకి వెళ్లవద్దు అంటూ మత్స్యకారులందరి కి సలహాను ఇవ్వడమైంది. దాదాపు గా ఒక లక్ష మంది ప్రజల ను సురక్షితమైనటవంటి స్థలాల కు తరలించడం జరుగుతున్నది. తాజా పరిణామాలను గురించిన సమాచారాన్ని ఐఎమ్ డి ఎప్పటికప్పుడు బాంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వం పూర్తి సమర్థన ను అందిస్తోందని, మరి నిరంతరాయంగా ఈ విధమైన టువంటి సమర్థన ను అవశ్యం అందిస్తూ ఉంటుందని ప్రధాన మంత్రి అన్నారు. స్థితి ని దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తూ ఉండాలని, చక్రవాతం తీరాన్ని దాటిన అనంతరం పునరుద్ధరణ పనుల నిమిత్తం అవసరపడిన సహాయాన్ని అందించడం కోసం సమీక్ష ను చేపట్టాలని ఆయన అన్నారు.
ఇప్పటికే పశ్చిమ బంగాల్ లో మోహరించిన ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు పన్నెండు మరియు ఒడిశా లో ఒక ఎన్ డిఆర్ఎఫ్ బృందానికి తోడు మరిన్ని బృందాల ను సిద్ధం గా ఉంచి ఒక గంట వ్యవధి లోపల అవి రంగం లోకి దిగేందుకు తయారు గా ఉండాలి అని ప్రధాన మంత్రి ఆదేశాలను ఇచ్చారు.
ఏదైనా అత్యవసర స్థితి ఎదురైతే భారతీయ కోస్తా తీరరక్షకదళం తన శక్తులను రంగం లోకి దింపుతుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలనరు అయినా నివారించడానికి గాను నౌకాశ్రయాలు, రైల్ వేస్ మరియు హైవేస్ అత్యంత జాగరూకత తో ఉండాలి అని ఆయన అన్నారు.
ఈ సమావేశం లో ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి, కేబినెట్ సెక్రట్రి, హోం సెక్రట్రి, ఎన్ డిఆర్ఎఫ్ డిజి, ఐఎమ్ డి డిజి, ఇంకా ఎన్ డిఎమ్ఎ సెక్రట్రి లు కూడ పాల్గొన్నారు.
****
(Release ID: 2021762)
Visitor Counter : 160
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam