హోం మంత్రిత్వ శాఖ
హెలికాప్టర్ విరిగిపడిన ఘటన లోమరణించిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క అధ్యక్షుడు డాక్టర్ శ్రీ సైయ్యద్ఇబ్రాహిమ్ రాయ్ సీ, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క విదేశీ వ్యవహారాల మంత్రిశ్రీ హోసైన్ అమీర్-అబ్దుల్లాహియన్ లు
గౌరవ సూచకం గా 2024 మే 21 వ తేదీ న (మంగళవారం) ఒక రోజు సంతాపాన్ని ప్రకటించిన ప్రభుత్వం
Posted On:
20 MAY 2024 5:27PM by PIB Hyderabad
హెలికాప్టర్ విరిగిపడిన ఘటన లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క అధ్యక్షుడు డాక్టర్ శ్రీ సైయ్యద్ ఇబ్రాహిమ్ రాయ్ సీ మరియు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హోసైన్ అమీర్-అబ్దుల్లాహియన్ లు చనిపోయారు. మృతుల కు గౌరవ సూచకం గా 2024 మే 21 వ తేదీ న (మంగళవారం) దేశం అంతటా ఒక రోజు ఆధికారిక సంతాప దినాన్ని పాటించాలంటూ భారత ప్రభుత్వం ఒక ప్రకటన లో పేర్కొన్నది.
సంతాప దినం నాడు, జాతీయ పతాకం మామూలుగా రెపరెపలాడుతూ ఉండే భవనాలన్నింటి పైన మువ్వన్నెల జెండా ను సగానికి దించి ఉంచడం జరుగుతుంది; అంతేకాకుండా ఆ రోజు న ఎటువంటి ఆధికారిక వినోద కార్యక్రమాన్ని నిర్వహించబోరు.
***
(Release ID: 2021211)