సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
బాంగ్లాదేశ్ లోప్రభుత్వ ఉద్యోగుల కు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల అమలు తాలూకు మార్గసూచీ నిగురించి చర్చించడాని కి భారతదేశం-బాంగ్లాదేశ్ ద్వైపాక్షిక సమావేశాన్నినిర్వహించడమైంది
డిఎఆర్‌పిజి యొక్కకార్యదర్శి మరియు బాంగ్లాదేశ్ లోని నాలుగు సామర్థ్య నిర్మాణ సంస్థల రెక్టర్ స్ (కార్యదర్శులు) సహా ప్రజా పరిపాలనమంత్రిత్వ శాఖ కు చెందిన సీనియర్ అధికారుల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది
Posted On:
17 MAY 2024 1:47PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం లో పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి శ్రీ వి. శ్రీనివాస్ మరియు బాంగ్లాదేశ్ లోని నాలుగు సామర్థ్య నిర్మాణ సంస్థల యొక్క రెక్టర్ (కార్యదర్శులు) తో పాటు ప్రభుత్వ పరిపాలన మంత్రిత్వ శాఖ కు చెందిన సీనియర్ అధికారులు సహా నేశనల్ అకైడమి ఫార్ ప్లానింగ్ ఎండ్ డెవలప్‌మెంట్ (ఎన్ఎపిడి)- బాంగ్లాదేశ్ యొక్క డైరెక్టర్ జనరల్ (కార్యదర్శి) శ్రీ సుకేశ్ కుమార్ సర్‌కార్ లకు మధ్య 2024 మే నెల 16 వ తేదీ న ఆన్ లైన్ మాధ్యం ద్వారా ఒక ద్వైపాక్షిక సమావేశం జరిగింది.
సమావేశం లో బాంగ్లాదేశ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేశన్ ట్రైనింగ్ సెంటర్ (బిపిఎటిసి) యొక్క రెక్టర్ (కార్యదర్శి) శ్రీ మోహమ్మద్ అశ్ రఫ్ ఉద్దీన్, బాంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ అడ్ మినిస్ట్రేశన్ అకైడమి (బిసిఎస్ఎఎ) యొక్క రెక్టర్ (కార్యదర్శి) శ్రీ ఎండి. ఉమర్ ఫారుక్ మరియు నేశనల్ అకైడమి ఫార్ డెవలప్‌మెంట్ అడ్ మినిస్ట్రేశన్ (ఎన్ఎడిఎ), బాంగ్లాదేశ్ యొక్క రెక్టర్ (కార్యదర్శి) డాక్టర్ శ్రీ ఎమ్ డి శాహిదుల్లాహ్ మరియు ప్రజా పాలన మంత్రిత్వ శాఖ యొక్క అడిశనల్ సెక్రట్రి డాక్టర్ ఎమ్. జియావుల్ హక్ లు పాలుపంచుకొన్నారు.
భారతదేశం పక్షాన పాలన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం (డిఎఆర్‌పిజి) యొక్క సంయుక్త కార్యదర్శి శ్రీ ఎన్.బి.ఎస్. రాజ్‌పుత్, డిఎఆర్‌పిజి, నేశనల్ సెంటర్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సిజిజి) మరియు బాంగ్లాదేశ్ లో భారత హై కమిశన్ కు చెందిన ఇతర సీనియర్ అధికారులు సమావేశం లో పాల్గొన్నారు.
సీనియర్ అధికారుల తో డిఎఆర్‌పిజి కార్యదర్శి శ్రీ వి. శ్రీనివాస్
ఈ సమావేశం లో విభిన్న అంశాల పైన చర్చించడమైంది. వాటిలో (1) ప్రజా పాలన మంత్రిత్వ శాఖ లో సామర్థ్య నిర్మాణ సంస్థల సిబ్బంది కి సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల ను నిర్వహించడం, (2) సీసినియర్ ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాము ను చేపట్టడం, (3) బాంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల లో పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఎన్‌సిజిజి లో ఏర్పాటు చేయడం, (4) ఇరవై ఏడో నేశనల్ ఇ-గవర్నెన్స్ కాన్ఫరెన్స్ లో బాంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పాలుపంచుకోవడం వంటి అంశాలు ఉన్నాయి. పైన పేర్కొన్న చర్చ అనంతరం బాంగ్లాదేశ్ లోని సీనియర్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎన్‌సిజిజి లో ఒక వారం రోజుల పాటు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని ఎన్‌సిజిజి నిర్వహించాలని, అలాగే బిపిఎటిసి, బిసిఎస్ అడ్ మినిస్ట్రేశన్ అకైడమి, ఎన్ఎపిడి, ఇంకా ఎన్ఎడిఎ ల ఫేకల్టీ సభ్యుల కోసం 2024 వ సంవత్సరం జులై లోను, సెప్టెంబర్ లోను రెండేసి వారాల సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల ను నిర్వహించాలని అంగీకారం వ్యక్తమైంది. బాంగ్లాదేశ్ ప్రభుత్వం లోని సీనియర్ ఉద్యోగుల కు నిర్వహించిన 71 సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల లో పాల్గొన్న వారిలో నుండి ఎంపిక చేసిన పూర్వ విద్యార్థుల తో ఎన్‌సిజిజి ఒక ఆలమ్‌ని మీట్ ను నిర్వహిస్తుంది. ఈ పూర్వ విద్యార్థులు వారు ఏమేమి అంశాల ను నేర్చుకొన్నదీ పరస్పరం వెల్లడించుకొంటారు. దీనికి అదనం గా ఇరవై ఏడో నేశనల్ ఇ-గవర్నెన్స్ కాన్ఫరెన్స్ లో వక్తలుగా పాలుపంచుకోండి అంటూ పురస్కార గ్రహీతలైన బాంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ను ఆహ్వానించాలి అనే నిర్ణయాన్ని కూడా తీసుకోవడమైంది.
బాంగ్లాదేశ్ ప్రజా పాలన మంత్రిత్వ శాఖ యొక్క అడిశనల్ సెక్రట్రి డాక్టర్ ఎమ్. జియాఉల్ హక్
నేశనల్ సెంటర్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సిజిజి) 2014 వ సంవత్సరం మొదలుకొని 2024 వ సంవత్సరం మధ్య కాలం లో బాంగ్లాదేశ్ కు చెందిన 2660 మంది సివిల్ సర్వీస్ ఆఫీసర్ లకు మొత్తం 71 సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల ను విజయవంతం గా నిర్వహించింది. ఉభయ పక్షాలు 2025 వ సంవత్సరం నుండి 2030 వ సంవత్సరం మధ్య కాలం లో 1500 మంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల నిర్వహణ కోసం సహకారాన్ని నవీనీకరించుకోవాలి అనే విషయం లో సమ్మతి ని వ్యక్తం చేశాయి.
***
(Release ID: 2020940)
Visitor Counter : 86