సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

సిబ్బంది పాలన మరియు పరిపాలన లో సహకారం కోసంభారతదేశం-కెన్యా ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించడమైంది


డిఎఆర్‌పిజి యొక్క కార్యదర్శి మరియు కెఎస్‌జి యొక్కడైరెక్టర్ జనరల్ ల నేతృత్వం లో జరిగిన ద్వైపాక్షిక చర్చల లో సామర్ధ్యం నిర్మాణసంబంధి కార్యక్రమాల పై శ్రద్ధ వహించడమైంది

మసూరి లోని ఎన్‌సిజిజి లో కెన్యా కు చెందిన సీనియర్ అధికారుల లో సామర్థ్య నిర్మాణం అంశం పై కలసి పనిచేయనున్న నేశనల్ సెంటర్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సిజిజి) మరియు కెన్యా స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ (కెఎస్‌జి) లు

Posted On: 17 MAY 2024 12:29PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం లో పరిపాలన పరమైన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం (డిఎఆర్‌పిజి) యొక్క కార్యదర్శి శ్రీ వి. శ్రీనివాస్ 2024 మే 14 వ తేదీ నాడు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా కెన్యా స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ యొక్క డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ శ్రీ నూర్ మొహమ్మద్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం లో భారతదేశం పక్షాన డిఎఆర్‌పిజి, నేశనల్ సెంటర్ ఫార్ గుడ్ గవర్నెన్స్ ల సీనియర్ అధికారులు, కెన్యా లో భారతదేశం హై కమిశన్ మరియు కెన్యా తరఫు న కెఎస్‌జి యొక్క డైరెక్టరు పాల్గొన్నారు.

 

ఈ సమావేశం లో ఉభయ పక్షాలు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహించాలని భావిస్తూ సిబ్బంది పాలన మరియు పరిపాలన అంశాల లో నేశనల్ సెంటర్ ఫార్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సిజిజి) మరియు కెన్యా స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ (కెఎస్‌జి) ల మాధ్యం ద్వారా భారతదేశం-కెన్యా ద్వైపాక్షిక సహకారాన్ని వృద్ధి చెందింప చేసుకోవడం పైన చర్చించడమైంది. ద్వైపాక్షిక సమావేశం లో ఎన్‌సిజిజి మరియు కెఎస్‌జి ల మధ్య సహకారాన్ని గురించిన రూపురేఖల ను చర్చించడమైంది. సహకరించుకోదగిన రంగాల లో కెన్యా లోని సీనియర్ అధికారుల కు ఎన్‌సిజిజి లో సామర్థ్య నిర్మాణాన్ని చేపట్టాలని సంకల్పించడమైంది. సిపిజిఆర్ఎఎమ్ఎస్ సంస్కరణల అమలు, నేశనల్ ఇ-సర్వీసెస్ డెలివరీ అసెస్‌మెంట్ ను ఉపయోగించుకొంటూ, ఎలక్ట్రానిక్ సేవల కు ప్రమాణాల ను ఖాయపరచడం, ప్రజా పరిపాలన లో ఉత్కృష్టత ను కనబరచినందుకు ‘ప్రధాన మంత్రి పురస్కారాల’ ను ప్రదానం చేయడం ద్వారా ప్రతిభ కు గుర్తింపు ను ఇవ్వడం వంటి ఉదాహరణల ద్వారా ‘‘గరిష్ఠ పాలన - కనిష్ఠ సర్కారు’’ విధానాన్ని అమలుపరచడం లో భారతదేశం ప్రభుత్వం సాధించిన ప్రగతి ని భారతదేశం పక్షం వివరించింది. ఎన్‌సిజిజి యొక్క కార్యకలాపాలు మరియు కార్యసాధన ల తాలూకు సమగ్రమైన సమర్పణ ను కూడా ప్రదర్శించడమైంది. కెన్యా పక్షం ప్రభుత్వ ఉద్యోగులకు సామర్ధ్యం నిర్మాణం కార్యక్రమం లో కెఎస్ జి యొక్క భూమిక ను గురించి తెలియ జేసింది. కెన్యా ప్రభుత్వం మరియు కెన్యా ప్రభుత్వ ఉద్యోగుల కు కెన్యన్ విజన్ 2030 ను సాకారం చేయడం కోసం ఉద్దేశించినటువంటి పరివర్తన కార్యక్రమం లో నాయకత్వం వహించే విధం గా తోడ్పడుతున్నట్లు కెఎస్ జి వెల్లడించింది.

 

 

 

***



(Release ID: 2020909) Visitor Counter : 40