సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కేన్స్ చలన చిత్రోత్సవంలో భారత్ పర్వ్ వేడుకలు


భారతీయ సంస్కృతి, వంటకాలు, సినిమాలు ప్రదర్శించిన కార్యక్రమానికి హాజరైన 250 మందికి పైగా ప్రతినిధులు
55వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం పోస్టర్ ఆవిష్కరణ

Posted On: 17 MAY 2024 2:59PM by PIB Hyderabad

చలన చిత్ర రంగంలో ప్రముఖ కార్యక్రమం అయిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండు రోజుల క్రితం ప్రారంభమైంది.   కంటెంట్, గ్లామర్ మేళవింపుతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పది రోజుల పాటు జరుగుతుంది. 

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న ఫ్రెంచ్ రివేరాలో భారతీయ సినిమాతో పాటు భారతదేశ  గొప్ప సంస్కృతి, వంటకాలు మరియు హస్తకళలు ప్రదర్శించడానికి మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న భారత్ పర్వ్ కార్యక్రమాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు ప్రారంభించారు. 

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫిక్కీ సహకారంతో జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ  నిర్వహించిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.  కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరవుతున్న   ప్రతినిధులు సాయంత్రం అత్యద్భుతమైన  ప్రదర్శనలు, భారత వంటకాలను ఆస్వాదించారు. .

గోవాలో   55వ ఐఎఫ్ఎఫ్ఐ, ఐఎఫ్ఎఫ్ఐలో భాగంగా నిర్వహించనున్న    వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ (వేవ్స్) ప్రారంభ ఎడిషన్ కు సంబంధించిన పోస్టర్లను, సేవ్ ది డేట్ పోస్టర్ ను శ్రీ సంజయ్ జాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాతలు అశోక్ అమృత్ రాజ్, రిచీ మెహతా, గాయకుడు షాన్, నటుడు రాజ్ పాల్ యాదవ్, సినీ నటుడు బాబీ బేడీ తదితరులు పాల్గొన్నారు.

Image

భారతీయ ఆతిథ్యంలో అంతర్లీనంగా ఉన్న ఆతిధ్య అంశాన్ని ప్రతినిధులకు పరిచయం చేయడానికి సే భారత్ పర్వ్ కోసం మెనూను ప్రముఖ చెఫ్ వరుణ్ తోట్లానీ ప్రత్యేకంగా సిద్ధం చేశారు. 

ప్రముఖ గాయని సునంద శర్మ వర్ధమాన గాయకులు ప్రగతి, అర్జున్, షాన్ కుమారుడు మాహితో కలిసి పాడిన  పంజాబీ పాటలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఆహుతుల హర్షధ్వానాల మధ్య  మా తుజే సలాం పాటతో ప్రదర్శన ముగిసింది.

భారత్ పర్వ్ కు గౌరవనీయ అతిథులుగా  నటి శోభితా ధూళిపాళ, అస్సామీ సినిమాల్లో నటించిన అస్సామీ నటి అమీ బరౌవా, సినీ విమర్శకుడు అనుపమ చోప్రా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత చలన చిత్ర రంగం ప్రాధాన్యత,  ప్రపంచ వేదికపై భారతదేశ చిత్ర రంగానికి  పెరుగుతున్న ప్రభావాన్ని కార్యక్రమం చాటి చెప్పింది. 

.చలన చిత్రం, సంస్కృతి ,కళాత్మక సహకారాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించిన భారతదేశ ప్రమాణాలు, సామర్థ్యాన్ని భారత్ పర్వ్ కలకాలం గుర్తించుకునే విధంగా సాగింది. 

***



(Release ID: 2020907) Visitor Counter : 67