నౌకారవాణా మంత్రిత్వ శాఖ

చాబహార్ లో శాహిద్ బెహిశ్తీ పోర్ట్ టర్మినల్ యొక్కఅభివృద్ధి కోసం దీర్ఘకాలిక ముఖ్య ఒప్పందం పై ఇండియా పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్(ఐపిజిఎల్) మరియు ఇరాన్ కు చెందిన పోర్ట్ స్ ఎండ్ మేరీటైమ్ ఆర్గనైజేశన్  (పిఎమ్ఒ) లు సంతకాలు చేశాయి

Posted On: 13 MAY 2024 6:03PM by PIB Hyderabad

చాబహార్ లో శాహిద్ బెహిశ్తీ పోర్ట్ టర్మినల్ యొక్క అభివృద్ధి కోసం 2024 మే నెల 13 వ తేదీ న జరిగే దీర్ఘకాలిక ముఖ్య ఒప్పందం పై సంతకాల కార్యక్రమం లో పాలుపంచుకోవడం కోసం నౌకాశ్రయాలు, ఓడరవాణా, జల మార్గాలు మరియు ఆయుష్ శాఖ ల కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ ఇరాన్ లోని చాబహార్ ను సందర్శించారు. ఈ కాంట్రాక్టు పత్రాల పైన ఇండియా పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్ (ఐపిజిఎల్) మరియు ఇరాన్ కు చెందిన పోర్ట్ స్ ఎండ్ మేరీటైమ ఆర్గనైజేశన్ (పిఎమ్ఒ) లు సంతకాలు చేశాయి.

 

ఇరాన్ లో రహదారులు మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ మెహర్‌ దాద్ బజ్ర్ పాశ్ తో కేంద్ర మంత్రి జరిపిన ద్వైపాక్షిక సమావేశం ఫలప్రదం గా ముగిసింది. ఇరువురు మంత్రులు కనెక్టివిటీ కి సంబంధించిన కార్యక్రమాల లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత సుదృఢపరచడం కోసం మరియు చాబహార్ నౌకాశ్రయాన్ని ఒక రీజినల్ కనెక్టివిటీ హబ్ గా తీర్చిదిద్దడం కోసం తమ నేతలు వ్యక్తం చేసిన ఉమ్మడి దార్శనికత ను గుర్తు కు తెచ్చుకొన్నారు.

 

ఈ మంత్రి స్థాయి యాత్ర మరియు దీర్ఘకాలిక ఒప్పందం పై సంతకాల కార్యక్రమం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాల ను మరింత గా బలపడుతాయి; అంతేకాక, అఫ్‌గానిస్తాన్ తో మరియు ఆసియా మధ్య ప్రాంతం లో అనేక దేశాల తో వ్యాపారానికి ఒక ప్రవేశ ద్వారం గా చాబహార్ కు ఉన్న ప్రాముఖ్యం ప్రస్ఫుటం అవుతుంది కూడాను.

 

చాబహార్ నౌకాశ్రయం ప్రాజెక్టు యొక్క అభివృద్ధి భారతదేశం మరియు ఇరాన్ ల ఆధ్వర్యం లోని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు గా ఉన్నది.

 

***

 



(Release ID: 2020556) Visitor Counter : 95