నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
నెదర్‌లాండ్స్ లోజరుగుతున్న వరల్డ్ హైడ్రోజన్ సమిట్ 2024 లో తొలిసారి గా భారతదేశం ఏర్పాటు చేసిన పెవిలియన్ నేశనల్ గ్రీన్ హైడ్రోజన్మిశన్ ను కళ్ళకు కట్టింది
Posted On:
14 MAY 2024 10:23AM by PIB Hyderabad
‘వరల్డ్ హైడ్రోజన్ సమిట్ 2024’ ను నెదర్‌లాండ్స్ లోని రాటర్ డేమ్ లో 2024 మే నెల 13 వ తేదీ మొదలుకొని 15 వ తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్న క్రమం లో, భారతదేశం మొట్ట మొదటిసారి గా తన సొంత పెవిలియన్ ను ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం లోని నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ‘ద ఇండియా పెవిలియన్’ ఆ శిఖర సమ్మేళనం లో కొలువుదీరిన అతి పెద్దవి అయినటువంటి పెవిలియన్ లలో ఒకటి గా ఉన్నది. ఈ పెవిలియను ను నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ యొక్క కార్యదర్శి శ్రీ భూపేందర్ ఎస్. భల్లా 2024 మే నెల 12 వ తేదీ నాడు ప్రారంభించారు.
ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ ఇకోసిస్టమ్ లో వరల్డ్ హైడ్రోజన్ సమిట్ ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం గా పేరు ను తెచ్చుకొంది. ఈ శిఖర సమ్మేళనాని కి ప్రపంచవ్యాప్తం గా సుమారు 15,000 మంది ప్రతినిధులు హాజరు అవుతారన్న అంచనా ఉంది. ఈ సమావేశాల లో భాగం గా ఏర్పాటు చేసిన ది ఇండియా పెవిలియన్ భారతదేశం గ్రీన్ హైడ్రోజన్ రంగం లో సాధించిన ప్రగతి ని ప్రపంచం కళ్ళెదుట ప్రదర్శించేందుకు ఒక అవకాశాన్ని అందిస్తున్నది.
భారతదేశం పక్షాన ఈ సమావేశాల లో పాలుపంచుకొంటున్న ప్రతినిధి వర్గం లో నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ, సైన్స్ ఎండ్ టెక్నాలజీ విభాగం, రైల్ వే స్ మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మరియు సహజ వాయువు ల మంత్రిత్వ శాఖ లకు చెందిన నామినీల తో పాటు ప్రైవేటు రంగ కంపెనీ ల నామినీ లు కూడా ఉన్నారు. వివిధ జి2జి భేటీ లకు అదనం గా, ఈ శిఖర సమ్మేళనం ప్రపంచం అంతటి నుండి తరలివచ్చే కంపెనీల తో సంప్రదింపులు జరిపేందుకు భారతదేశ పరిశ్రమ కు ఒక వేదిక ను సమకూర్చుతున్నది.
భారతదేశం నేశనల్ గ్రీన్ హైడ్రోజన్ మిశన్ ను 2023 జనవరి నెల లో 19,744 కోట్ల రూపాయల మొత్తం వ్యయం తో ప్రారంభించింది. 2030 వ సంవత్సరం చివరి కల్లా 5 ఎమ్ఎమ్‌టి (మిలియన్ మెట్రిక్ టన్నులు) ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదన ను సాధించాలి అనేటటువంటి ఒక మహత్వాకాంక్ష భరితమైన లక్ష్యాన్ని భారతదేశం నిర్దేశించుకొంది. నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ ఇంతవరకు 4,12,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదన సామర్థ్యం కలిగి ఉండే ప్లాంటు ల ఏర్పాటు కు మరియు 1,500 ఎమ్‌డబ్ల్యు సామర్థ్యం కలిగి ఉండే ఇలెక్ట్రోలైజర్ యూనిట్టు ల స్థాపన కు టెండర్ లను ఇచ్చింది.
ఉక్కు, రవాణా/ మొబిలిటీ మరియు నౌకాయానం రంగాల లో గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగాని కి సంబంధించిన మార్గదర్శకాల తో కూడిన పథకాన్ని కూడా భారతదేశం ప్రకటించింది. భారతదేశం లో గ్రీన్ హైడ్రోజన్ ఇకోసిస్టమ్ ను ప్రోత్సహించేందుకు మరియు ఆ రంగం లో నూతన ఆవిష్కరణల ను ప్రోత్సహించేందుకు సైన్స్ మరియు టెక్నాలజీ విభాగం హైడ్రోజన్ వేలీ ఇనొవేశన్ క్లస్టర్స్ ను ఆరంభించింది.
నేశనల్ గ్రీన్ హైడ్రోజన్ మిశన్ కు సంబంధించిన యావత్తు సమాచారాన్ని మరియు భారతదేశం లో గ్రీన్ హైడ్రోజన్ ఇకోసిస్టమ్ యొక్క అభివృద్ధికి తీసుకోవలసిన చర్యల ను తెలియజేసే ఒక సమగ్ర పోర్టల్ ను ఇటీవల ప్రారంభించడమైంది. ఈ పోర్టల్ ను ఆన్ లైన్ లో https://nghm.mnre.gov.in/ అనే యుఆర్ఎల్ ను క్లిక్ చేసి సందర్శించ వచ్చును.
***
(Release ID: 2020554)
Visitor Counter : 303