రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

నౌకల నిర్మాణాని కి దేశీయం గా మరీన్-గ్రేడ్అల్యూమినియమ్ ను తయారు చేయడం తో పాటు సరఫరా చేయడానికి ప్రైవేటు రంగం తో ఎమ్ఒయు నుకుదుర్చుకున్న ఐసిజి

Posted On: 10 MAY 2024 12:17PM by PIB Hyderabad

నౌకల ను నిర్మించడం కోసం భారతదేశం లో పబ్లిక్ రంగం లోని మరియు ప్రైవేటు రంగం లోని శిప్ యార్డుల కు దేశవాళీ మరీన్-గ్రేడ్ అల్యూమినియమ్ తయారీ, ఇంకా సరఫరాల కై ఉద్దేశించినటువంటి ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పైన భారతీయ కోస్తాతీర రక్షక దళం (ఐసిజి) మరియు హిండాల్కో ఇండస్ట్రీస్ లు సంతకాలు చేశాయి. ఈ ఎమ్ఒయు మూడు నెలల వారీ ధరల నిర్ణయం, సరఫరాల లో ప్రాధాన్యం మరియు టర్నోవర్ డిస్కౌంటు ల వంటి ప్రయోజనాల ను కూడ అందించనుంది.

 

అల్యూమినియమ్ తో తయారైన స్థూలభాగం కలిగినటువంటి 67 నౌకల ను ప్రస్తుతం ఐసిజి నడుపుతున్నది. ఈ తరహా నౌకలు లోతు లేనటువంటి జలాల్లో కూడ తిరుగుతున్నాయి. కోస్తాతీర ప్రాంత భద్రత ను మరింత గా పెంచడం కోసం, ఐసిజి ఈ తరహా నౌకల ను మరిన్నిటిని తీసుకోవాలని పథకరచన చేసింది. ఈ విధమైన నౌకల ను తయారు చేయడం కోసం మరీన్-గ్రేడ్ అల్యూమినియమ్ ను ఉపయోగించనున్నారు.

 

ఎమ్ఒయు పై ఐసిజి కి చెందిన సీనియర్ అధికారుల సమక్షం లో ఐసిజి యొక్క డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (సామగ్రి మరియు నిర్వహణ) ఐజి శ్రీ హెచ్.కె. శర్మ మరియు హిండాల్కో సిఇఒ, డౌన్‌స్ట్రీమ్ అల్యూమినియమ్ బిజినెస్ శ్రీ నీలేశ్ కౌల్ లు సంతకాలు పెట్టారు.

 

 

**



(Release ID: 2020198) Visitor Counter : 98