ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ ఎనెక్సీ లో భావి అంతర్జాతీయయోగ దివస్ సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్‌డిఒఎన్ఇఆర్

Posted On: 09 MAY 2024 12:22PM by PIB Hyderabad

రాబోయే అంతర్జాతీయ యోగ దివస్ కు సన్నాహకమా అన్నట్లు గా ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎమ్‌డిఒఎన్ఇఆర్) న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ ను ఆనుకొని ఉన్న భవనం లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం లో భారతీయ వారసత్వం లో చెక్కుచెదరకుండా ఇమిడిపోయి ఉన్న యోగాభ్యాసం తాలూకు చిరకాలిక ప్రయోజనాల ను గురించి ఎమ్‌డిఎన్ఐవై కు చెందిన బోధకులు మరియు అభ్యాసకులు చాటి చెబుతూ ఉండగా వారి మార్గదర్శకత్వం లో ఎమ్‌డిఒఎన్ఇఆర్ యొక్క కార్యదర్శి మరియు అధికారుల తో పాటు విజ్ఞాన్ భవన్ ఎనెక్సీ లోని సిఐఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

 

మానవుని సమగ్ర స్వస్థత ను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యం తో ఈ కార్యక్రమం లో యోగ ఆసనాల ను తెలియజేయడమైంది. శారీరికమైన, మానసికమైన మరియు ఆధ్యాత్మికమైన ఆరోగ్యం పరం గా యోగ యొక్క భూమిక ను గురించి డిఒఎన్ఇఆర్ కార్యదర్శి వివరించారు.

 

ఎమ్‌డిఒఎన్ఇఆర్ ఆధ్వర్యం లో చేపట్టిన ఈ సన్నాహక కార్యక్రమం యోగ మాధ్యం ద్వారా మానవుల ఆరోగ్యాన్ని మరియు ఆరోగ్య సంస్కృతి ని పెంపొందింప చేయడం కోసం భారతదేశం కంకణం కట్టుకోవడాన్ని పునరుద్ఘాటిస్తున్నది. విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమం యోగ కు ఉన్న సార్వజనికమైనటువంటి మక్కువ ను స్ఫురణ కు తేవడం తో పాటుగా వర్తమాన సవాళ్ళ ను ఎదుర్కోవడం లో యోగ కు ఉన్న చిరకాల ప్రాసంగికత ను గుర్తు కు తెస్తున్నది.

 

భారతదేశ ప్రాచీన సంప్రదాయం లో వేళ్ళూనుకొన్నటువంటి యోగ మనుష్యుల శారీరిక, మానసిక మరియు ఆధ్యాత్మిక స్వస్థత పై తన సకారాత్మకమైన ప్రభావాన్ని ప్రసరింప చేస్తుందన్న విస్తృత గుర్తింపు ను తెచ్చుకొంది. ఎమ్ డిఒఎన్ఇఆర్ ఆధ్వర్యం లో తాజా కార్యక్రమం స్వస్థత మరియు సమతుల్యభరిత జీవన సరళి కోసం రోజువారీ జీవనం లో యోగ ను ఒక భాగం గా చేసుకోవడానికి కట్టబెట్టవలసినటువంటి మహత్వాన్ని ప్రకటిస్తున్నది.

 

 

***



(Release ID: 2020092) Visitor Counter : 61