విద్యుత్తు మంత్రిత్వ శాఖ
గుజరాత్ లోని జిఐఎఫ్‌టి సిటీ లో తన సబ్సిడియరి కంపెనీ ని స్థాపించడం కోసం ఆర్‌బిఐ ఆమోదాన్ని పొందిన ఆర్ఇసి
Posted On:
05 MAY 2024 5:45PM by PIB Hyderabad
గుజరాత్ లోని గాంధీనగర్ లో గల గుజరాత్ ఇంటర్‌నేశనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (‘‘జిఐఎఫ్‌టి’’ సిటీ) లోని ఇంటర్ నేశనల్ ఫినాన్శల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్‌సి) లో తనకు పూర్తి యాజమాన్యం ఉండే ఒక సబ్సిడియరి కంపెనీ ని స్థాపించడం కోసం విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఆధీనం లోని ‘మహారత్న’ హోదా కలిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మరియు ఒక ప్రముఖ బేంకింగేతర ఆర్థిక సహాయ వాణిజ్య సంస్థ (ఎన్ బిఎఫ్ సి) అయినటువంటి ఆర్ఇసి లిమిటెడ్ ఒక ‘నిరభ్యంతర ధ్రువ పత్రాన్ని’ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) నుండి 2024 మే నెల 3 వ తేదీ నాడు అందుకొంది.
కార్యకలాపాల శ్రేణి ని వివిధీకరించుకొంటూ వృద్ధి కోసం క్రొత్త క్రొత్త మార్గాల ను అన్వేషిస్తున్న ఆర్ఇసి తన కార్యకలాపాల ను భారతదేశం లో ఆర్థిక సహాయ సేవ ల రంగం లో రోజు రోజు కు వృద్ధి చెందుతూ ఉన్న జిఐఎఫ్‌టి సిటీ లో విస్తరింప చేయాలనే నిర్ణయాన్ని తీసుకొంది. జిఐఎఫ్‌టి సిటీ లో ఒక ఫైనాన్స్ కంపెనీ గా రుణాల ను మంజూరు చేయడం, పెట్టుబడి, ఇంకా ఇతర ఆర్థిక సంబంధి సేవ లు సహా అనేక విధాలైన ఆర్థిక కార్యకలాపాల ను ప్రతిపాదిత సహాయక వ్యాపార సంస్థ నిర్వహించనుంది.
ఈ సందర్భం లో ఆర్ఇసి లిమిటెడ్ యొక్క సిఎమ్‌డి శ్రీ వివేక్ కుమార్ దేవాంగన్ మాట్లాడుతూ. ‘‘ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాల ను కలిగి ఉన్నటువంటి జిఐఎఫ్‌టి సిటీ లో అంతర్జాతీయ పరపతి సంబంధి కార్యకలాపాల కు అనుకూలమైన వాతావరణం నెలకొంది. ఈ అనుకూలతల ను ప్రపంచ బజారు లో ఆర్ఇసి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడం కోసం సద్వినియోగ పరచుకొంటుందన్న నమ్మకం మాలో ఉంది. జిఐఎఫ్‌టి సిటీ లో ఏర్పాటు అయ్యే సబ్సిడియరి కంపెనీ సరిక్రొత్త వ్యాపార అవకాశాల ను ఆర్ఇసి కి అందించడం ఒక్కటే కాకుండా, దేశం లో శక్తి రంగం యొక్క వృద్ధి కి ఎంతగానో తోడ్పడనుంది. ప్రపంచ రంగస్థలం లో మా పాదముద్ర ను మేం విస్తరింప చేసుకొంటూనే భారతదేశం లో విద్యుత్తు రంగం మరియు మౌలిక సదుపాయాల రంగం ల యొక్క వృద్ధి ని పెంపొందింప చేయాలన్న ఆర్ఇసి యొక్క మిశను ను ముందుకు తీసుకుపోవడం కోసం ఈ వ్యూహాత్మక నిర్ణయం తాలూకు ప్రయోజనాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాం’’ అన్నారు.
***
(Release ID: 2019706)
Visitor Counter : 270