రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

నౌకా దళాని కి ఉప ప్రధాన అధికారి గా పదవీ బాధ్యతల ను  స్వీకరించిన వైస్ ఎడ్‌మరల్ శ్రీ కృష్ణ స్వామినాథన్, ఎవిఎస్ఎమ్, విఎస్ఎమ్

Posted On: 01 MAY 2024 12:42PM by PIB Hyderabad

వైస్ ఎడ్ మరల్ శ్రీ కృష్ణ స్వామినాథన్, ఎవిఎస్ఎమ్, విఎస్ఎమ్ 2024 మే నెల 1 వ తేదీ నాడు నావల్ స్టాఫ్ కు వైస్ చీఫ్ గా పదవీ బాధ్యతల ను స్వీకరించారు. పదవీబాద్యతల ను స్వీకరించిన మీదట ఫ్లాగ్ ఆఫిసర్ జాతీయ యుద్ధ స్మారకం లో పుష్పాంజలి ని సమర్పించి దేశ ప్రజల సేవ లో ప్రాణాల ను ఆహుతి ఇచ్చిన వీరుల కు శ్రద్ధాంజలి ఘటించారు.

 

ఫ్లాగ్ ఆఫిసర్ ను 1987 జులై 1 వ తేదీ నాడు భారత నౌకా దళం లో చేర్చుకోవడమైంది. ఆయన ది కమ్యూనికేశన్ ఎండ్ ఎలక్ట్రానిక్ వార్‌ ఫేర్ లో నిపుణుడు. ఆయన ఖడక్‌వాస్‌ లా లోని నేశనల్ డిఫెన్స్ అకైడమి; యునైటెడ్ కింగ్ డమ్ లో గల శ్రీవెన్‌హమ్ లో జాయింట్ సర్వీసెస్ కమాండ్ ఎండ్ స్టాఫ్ కాలేజీ; కరంజా లోని కాలేజీ ఆఫ్ నేవల్ వార్‌ ఫేర్; మరియు యుఎస్ఎ లోని రోడ్ ఐలండ్, న్యూ పోర్ట్ లోని యునైటెడ్ స్టేట్స్ నేవల్ వార్ కాలేజ్ లకు చెందిన పూర్వ విద్యార్థి.

 

 

అతి విశిష్ట్ సేవా మెడల్, ఇంకా విశిష్ఠ్ సేవా మెడల్ ల సమ్మాన గ్రహీత అయినటువంటి ఎడ్ మరల్ శ్రీ కృష్ణ స్వామినాథన్ తన ఉద్యోగ జీవనం లో అనేక కీలకమైన పదవుల ను నిర్వహించారు. వాటిలో ఐఎన్ఎస్ విద్యుత్, మరియు ఐఎన్ఎస్ వినాశ్ లలో కమాండ్ ఆఫ్ మిసైల్ వెసల్స్, ఐఎన్ఎస్ కులీశ్ లో మిసైల్ కావ్‌రెట్ ; ఐఎన్ఎస్ మైసూర్ లో గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ; ఐఎన్ఎస్ విక్రమాదిత్య లో ఎయర్ క్రాఫ్ట్ కేరియర్ వంటి పదవులు ఉన్నాయి.

 

రియర్ ఎడ్ మరల్ గా పదోన్నతి ని పొందిన మీదట ఆయన కోచి లోని సదరన్ నేవల్ కమాండ్ యొక్క ప్రధాన కేంద్రం లో చీఫ్ స్టాఫ్ ఆఫిసర్ (ట్రైనింగ్) గా సేవ ను అందించారు. నౌకా దళం లో అన్ని విభాగాల లోను ఆపరేశనల్ సేఫ్టీ ని పర్యవేక్షించేటటువంటి ఇండియన్ నేవల్ సేఫ్టీ టీమ్ ను తీర్చిదిద్దడం లో ఆయన ముఖ్య పాత్ర ను పోషించారు. ఆ తరువాత ఆయన ఫ్లాగ్ ఆఫిసర్ సీ ట్రైనింగ్ హోదా లో నౌకా దళం లోని వర్క్-అప్ ఆర్గనైజేశన్ కు అధిపతి గా వ్యవహరించారు. తదనంతరం వెస్టర్న్ ఫ్లీట్ కు ఫ్లాగ్ ఆఫిసర్ కమాండింగ్ గా ఆయన కు ఒక ముఖ్యమైన పదవి లో నియామకం లభించింది. స్వోర్డ్ ఆర్మ్ ను సంపాదించుకొన్న తరువాత ఆయన ను ఫ్లాగ్ ఆఫిసర్ ఆఫ్‌ శోర్ డిఫెన్స్ ఎడ్వయిజరీ గ్రూపు, ఇంకా భారత ప్రభుత్వం లో ఆఫ్‌ శోర్ సెక్యూరిటి ఎండ్ డిఫెన్స్ సలహాదారు పదవి లో నియమించడమైంది.

 

 

వైస్ ఎడ్ మరల్ హోదా లో పదోన్నతి ని పొందిన తరువాత, ఆయన వెస్టర్న్ నేవల్ కమాండ్ కు చీఫ్ ఆఫ్ స్టాఫ్ గాను, ఎన్‌హెచ్‌క్యు లో కంట్రోలర్ ఆఫ్ పర్సనల్ సర్వీసెస్ గాను పని చేశారు. ప్రస్తుత నియామకం అయినటువంటి వైస్ చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ గా నియామకం జరగడాని కి పూర్వం ఆయన ఎన్‌హెచ్‌క్యు లో చీఫ్ ఆఫ్ పర్సనెల్ గా ఉన్నారు.

 

 

వైస్ ఎడ్ మరల్ శ్రీ కృష్ణ స్వామినాథన్ న్యూ ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్‌రూ యూనివర్సిటీ నుండి బిఎస్‌సి డిగ్రీ ని; కోచి లోని కొచ్చిన్ యూనివర్సిటీ లో సైన్స్ ఎండ్ టెక్నాలజీ నుండి టెలికమ్యూనికేశన్స్ లో ఎమ్ఎస్‌సి ని; లండన్ లోని కింగ్స్ కాలేజి లో డిఫెన్స్ స్టడీస్ విభాగం లో ఎమ్ఎ ను; ముంబయి యూనివర్సిటీ లో స్ట్రటీజిక్ స్టడీస్ లో ఎమ్‌ఫిల్ ను; మరి ముంబయి యూనివర్సిటీ లోనే ఇంటర్ నేశనల్ స్టడీస్ లో పిహెచ్‌డి ని సాధించారు.

 

****



(Release ID: 2019456) Visitor Counter : 88